Dhanush’s Sir: ధనుష్ సినిమా నుంచి ఆ క్రేజీ హీరోయిన్ తప్పుకుందా..? తప్పించారా.?.. అసలు విషయం ఏంటంటే..

తమిళ్ స్టార్ హీరో ధనుష్ కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాలిసిన అవసరం లేదు. ధనుష్ నటించిన సినిమాలు తెలుగులో కూడా విడుదలవుతుంటాయి

Dhanushs Sir: ధనుష్ సినిమా నుంచి ఆ క్రేజీ హీరోయిన్ తప్పుకుందా..? తప్పించారా.?.. అసలు విషయం ఏంటంటే..
Samyuktha Menon New Photos. Credit by:Samyuktha Menon/Twitter

Updated on: Jan 11, 2022 | 7:01 PM

Dhanush’s Sir: తమిళ్ స్టార్ హీరో ధనుష్ కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాలిసిన అవసరం లేదు. ధనుష్ నటించిన సినిమాలు తెలుగులో కూడా విడుదలవుతుంటాయి. మారి, మారి 2 సినిమాలు తెలుగులో మంచి విజయాలను అందుకున్నాయి. ఇదిలా ఉంటే ధనుష్ ఇప్పుడు స్ట్రయిట్ గా తెలుగులో సినిమాలు  చేస్తున్న విషయం తెలిసిందే. తెలుగులో ధనుష్ ఏకంగా రెండు సినిమాలు చేస్తున్నాడు. ఒకటి శేఖర్ కమ్ముల దర్శకత్వంలో చేస్తుండగా మా;రోకటి వెంకీ అట్లూరి దర్శకత్వంలో.. అయితే వీటిలో వెంకీ అట్లూరి సినిమా ముందుగా రానుంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ కూడా మ్మొదలు పెట్టేశారు. తొలిప్రేమ, మిస్టర్ మజ్ను, రంగ్ దే సినిమాలతో ఆకట్టుకున్న వెంకీ అట్లూరి ఇప్పడు ధనుష్ కోసం ఓ పవర్ ఫుల్ కథను సిద్ధం చేశాడు. ఈ సినిమాకు సార్ అనే ఇంట్రస్టింగ్ లటైటిల్ ను ఫిక్స్ చేశారు. రీసెంట్ గానే ఈ సినిమా పూజాకార్యక్రమాలు జరుపుకుంది.

ఇక ఈ సినిమాలో ధనుష్ కు జోడీగా మలయాళ ముద్దుగుమ్మ సంయుక్త మీనన్ నటిస్తుంది. తాజాగా ఈ సినిమాకు సంబందించిన లో రూమర్ ఫిలిం సర్కిల్స్ లో చక్కర్లు కొడుతుంది. ఈ సినిమాలో హీరోయిన్ గా ఎంపిక అయిన సంయుక్తమీనన్ తప్పుకున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. అందుకే మేకర్స్ మరో హీరోయిన్ కోసం సంప్రదింపులు జరుపుతున్నారు అనే వార్తలు వస్తున్నాయి. ఇదిలా ఉంటే ఈ సినిమాకోసం మరో హీరోయిన్ ను వెతుకుతున్న మాట వాస్తవమే కానీ  సంయుక్తమీనన్ ను తొలగించరా అన్నది తెలియాల్సి ఉంది. కానీ సంయుక్త ప్లేస్ ను రీప్లేస్ చేసేందుకే మరో హీరోయిన్ కోసం మేకర్స్ వెతుకుతున్నారని వార్తలు జోరుగా ప్రచారం జరుగుతున్నాయి. అసలు విషయం ఏంటా అని ఆరాతీస్తే ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ కావాల్సి ఉందట. సంయుక్త తోపాటు మరో హీరోయిన్ కూడా నటిస్తుండటం ఆ హీరోయిన్ కోసం మేకర్స్ వెతుకుంటున్నారట.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Pushpa: అల్లు అర్జున్ నిజంగా అదరగొట్టేశాడు .. పుష్ప సినిమా పై తమిళ్ స్టార్ హీరో కార్తీ ఇంట్రస్టింగ్ కామెంట్స్..

సినిమాతారలను వదలని మహమ్మారి.. వరుసగా కరోనా బారిన పడుతున్న మూవీ స్టార్స్.. ఆందోళనలో అభిమానులు

Viral Photo: ఈ ఫోటోలోని చిన్నారి ఓ కల్ట్ మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది.. ఎవరో గుర్తుపట్టారా..?

Loading...
Unable to load recommendations.
Follow Us