Comedian Satya: నా ట్యాలెంట్ ను గుర్తించింది ఆ డైరెక్టరే.. నా కూతురికి ఆయన పేరే పెట్టుకున్నా: కమెడియన్ సత్య

ఓవైపు స్టార్ హీరోల సినిమాల్లో కమెడియన్ గా చేస్తూనే మరోవైపు సోలో హీరోగానూ హిట్లు కొడుతున్నాడు కమెడియన్ సత్య. ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో బిజీగా ఉంటోన్న ఆయన తాజాగా ఓ స్టార్ డైరెక్టర్ గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.

Comedian Satya: నా ట్యాలెంట్ ను గుర్తించింది ఆ డైరెక్టరే.. నా కూతురికి ఆయన పేరే పెట్టుకున్నా: కమెడియన్ సత్య
Comedian Satya

Updated on: Nov 01, 2026 | 11:56 AM

కమెడియన్ సత్య.. ప్రస్తుతం టాలీవుడ్ లో ఈ నటుడి పేరు మార్మోగుతుంది. ఓ వైపు సోలో హీరోగా సినిమాలు చేస్తూనే మరోవైపు ఇతర హీరోల్లో కమెడియన్ గా, సహాయక నటుడిగా చేస్తున్నారీ ట్యాలెంటెడ్ యాక్టర్. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన సత్య ఇప్పుడు చేతి నిండా సినిమాలతో బిజీగా ఉంటున్నాడు. అసిస్టెంట్ డైరెక్టర్ గా కెరీర్ ను మొదలుపెట్టిన ఆయన జబర్దస్త్ తో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత కమెడియన్ గా మారాడు. స్వామి రారా, ఛలో, కార్తికేయ, రౌడీ ఫెలో, సూర్య వర్సెస్ సూర్య, సినిమా చూపిస్త మావ, ఎక్కడికి పోతావు చిన్నవాడా, రంగ స్థలం, చల్ మోహన్ రంగా, గద్దల కొండ గణేష్, సరిలేరు నీకెవ్వరు, భీష్మ, కార్తికేయ 2, గీతాంజలి మళ్లీ వచ్చింది, ఛారి 111, సరిలేరు నీకెవ్వరూ, భీష్మ, ఎఫ్ 3, హనుమాన్, మిస్టర్ బచ్చన్, పుష్ప 2: ది రూల్, భర్త మహాశయులకు విజ్ఞప్తి, మత్తు వదలరా, మత్తు వదలరా 2, వివాహ భోజనంబు, జెట్లీ, రీసెంట్ గా ఆదర్శ కుటుంబం.. ఇలా ఎన్నో సినిమాల్లో హీరోగా, కమెడియన్ గా మెప్పించారు సత్య. ప్రస్తుతం టాలీవుడ్ లో బిజీగా ఉన్న ఆర్టిస్టుల్లో సత్య కూడా ఒకరు. మరి ఈ నటుడి ట్యాలెంట్ ను మొదటగా గుర్తించింది ఎవరో తెలుసా?

కాగా ఓ ఇంటర్వ్యూలో తనకు పెళ్లయిందని, 9 ఏళ్ల కుమార్తె కూడా ఉందని సత్య చెప్పుకొచ్చారు. అంతేకాదు తన కుమార్తె పేరు వెనక ఒక పెద్ద స్టోరీ ఉందని కూడా పేర్కొన్నాడు. కాగా సత్య కెరీర్ లో ఎప్పటికీ గుర్తుండిపోయే సినిమా స్వామిరారా. ఈ సినిమాతోనే తెలుగులో బిజీ ఆర్టిస్టుగా మారిపోయారాయన. ఈ నేపథ్యంలో స్వామిరారా సినిమా డైరెక్టర్ అయిన సుధీర్ వర్మ పై ఉన్న గౌరవానికి గుర్తుగా తన కుమార్తె పేరుకు ‘సుధీర’ అని నామకరణం చేశాడు సత్య. డైరెక్టర్ సుధీర్ వర్మ స్వామిరారా సినిమాలో తనకు అవకాశం ఇవ్వడం వల్లే తన కెరీర్ ఇంత బిజీగా మారిందని, తనకంటూ గుర్తింపు వచ్చిందని సత్య పలు ఇంటర్వ్యూల్లో చెప్పుకొచ్చారు.

కాగా సత్య నటించిన లేటెస్ట్ సినిమ ‘ఆదర్శ కుటుంబం.. హౌస్ నెంబర్.. 47’. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తెరకెక్కించిన ఈ సినిమాలో విక్టరీ వెంకటేష్ హీరోగా నటించాడు. శ్రీనిధి శెట్టి, డింపుల్ హయతీ, నివేదా పేతురాజ్ హీరోయిన్లుగా చేశారు. ప్రస్తుతం ఈ సినిమా సూపర్ హిట్ టాక్ తో రన్ అవుతోంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Loading...
Unable to load recommendations.
Follow Us