Acharya Movie : శరవేగంగా ‘ఆచార్య’ షూటింగ్.. మారేడిమిల్లికి పయనమైన మెగాస్టార్ అండ్ టీమ్..

మెగాస్టార్ 'ఆచార్య' సినిమా కోసం అభిమానులంతా వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కీలక పాత్రలో నటించనున్నారన్న విషయం తెలిసిందే.

Acharya Movie : శరవేగంగా ఆచార్య షూటింగ్.. మారేడిమిల్లికి పయనమైన మెగాస్టార్ అండ్ టీమ్..

Updated on: Feb 21, 2021 | 8:41 AM

Acharya Movie : మెగాస్టార్ ‘ఆచార్య’ సినిమా కోసం అభిమానులంతా వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కీలక పాత్రలో నటించనున్నారన్న విషయం తెలిసిందే. ఇప్పటికే షూటింగ్ కూడా చివరిదశకు వచ్చేసింది. మొన్నీమధ్యే రామ్ చరణ్ కూడా షూటింగ్ లో అడుగు పెట్టాడు. ఈ సినిమాలో మెగాస్టార్ కు జోడీగా అందాల చందమామ కాజల్ హీరోయిన్ గా నటిస్తుంది. మే 13న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆచార్యలో రియల్ హీరో సోనూ సూద్ ప్రతినాయకుడిగా నటిస్తున్నాడు.

ప్రస్తుతం ఆచార్య షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. తూర్పుగోదావరి జిల్లాలోని మారేడిమిల్లిలో ఈ సినిమా షూటింగ్ జరుపుకోనుంది. అలాగే రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో షూటింగ్ చేయనున్నారు. ఇందుకోసం మెగాస్టార్ తూర్పుగోదావరి జిల్లాకు వెళ్లనున్నారు. దాంతో అభిమానులు మెగాస్టార్ కు ఘనస్వాగతం పలికేందుకు సిద్ధమయ్యారు. భారీ ర్యాలీని చేపట్టాలని అభిమానులు ఉత్సాహంగా ఉన్నారు ఇక ఆచార్య సినిమాలో చిరంజీవి రెండు డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించనున్నారని తెలుస్తుంది. మెగాస్టార్ నక్సలైట్ గా కనిపించనున్నారని ఫిలింసర్కిల్స్ లో ప్రచారం జరుగుతుంది. చిరుతోపాటు చరణ్ కూడా మారేడిమిల్లి వెళ్లనున్నారని సమాచారం.. చరణ్ చిరులపై వచ్చే సన్నివేశాలను అక్కడ తెరకెక్కించనున్నాడు కొరటాల. ఇక ఈ సినిమాకు మణిశర్మ సంగీతం సమకూరుస్తున్నారు. ఇటీవల విడుదలైన టీజర్ ఆచార్య సినిమా అంచనాలను పెంచేసింది.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Nandamuri Balakrishna : ‘ఉప్పెన’ సినిమా పై ప్రశంసలు కురిపించిన నట సింహం.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫోటో..

Nithiin Check Movie : నితిన్ ‘చెక్’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు గెస్ట్ గా ఆ మెగాహీరో..

 

 

Loading...
Unable to load recommendations.
Follow Us