Tollywood: పవన్ కళ్యాణ్ సినిమాలో నటించిన ఈ అమ్మాయిని గుర్తుపట్టారా..? ఇప్పుడేం చేస్తుందంటే..

|

Jul 05, 2024 | 6:29 PM

నిజానికి ఈ అమ్మాయి కోలీవుడ్ ఇండస్ట్రీలో చాలా ఫేమస్. అక్కడే వరుస సినిమాలు చేసింది. అందం, అభినయం ఎంత ఉన్నా ఇప్పటివరకు హీరోయిన్ అవకాశాలు మాత్రం రాలేదు. చైల్డ్ ఆర్టిస్ట్ గా పలు చిత్రాల్లో అలరించింది. హీరోయిన్ అమాలపాల్ కూతురిగానూ కనిపించింది. ఇప్పుడు ఈ బ్యూటీ లేటేస్ట్ ఫోటోస్ నెట్టింట ఆకట్టుకుంటున్నాయి. ఇంతకీ ఆ అమ్మాయి ఎవరో గుర్తుపట్టారా.. ? తన పేరు యువలక్ష్మి.

Tollywood: పవన్ కళ్యాణ్ సినిమాలో నటించిన ఈ అమ్మాయిని గుర్తుపట్టారా..? ఇప్పుడేం చేస్తుందంటే..
Yuva Sri
Follow us on

పైన ఫోటోలో కనిపిస్తున్న అమ్మాయి ఎవరో గుర్తుపట్టారా..? తెలుగులో ఒకే ఒక్క సినిమాలో నటించింది. అది కూడా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన లేటేస్ట్ మూవీ. బాక్సాఫీస్ వద్ద మంచి రివ్యూస్ అందుకున్న సినిమాలో కనిపించింది. కానీ ఈ బ్యూటీకి అదృష్టం మాత్రం కలిసిరాలేదు. తెలుగులో చేసిన ఒక్క సినిమాకు నటనతో ఫిదా చేసింది. కానీ ఆ తర్వాత మరో అవకాశం అందుకోలేదు. నిజానికి ఈ అమ్మాయి కోలీవుడ్ ఇండస్ట్రీలో చాలా ఫేమస్. అక్కడే వరుస సినిమాలు చేసింది. అందం, అభినయం ఎంత ఉన్నా ఇప్పటివరకు హీరోయిన్ అవకాశాలు మాత్రం రాలేదు. చైల్డ్ ఆర్టిస్ట్ గా పలు చిత్రాల్లో అలరించింది. హీరోయిన్ అమాలపాల్ కూతురిగానూ కనిపించింది. ఇప్పుడు ఈ బ్యూటీ లేటేస్ట్ ఫోటోస్ నెట్టింట ఆకట్టుకుంటున్నాయి. ఇంతకీ ఆ అమ్మాయి ఎవరో గుర్తుపట్టారా.. ? తన పేరు యువలక్ష్మి.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ , హీరో సాయి ధరమ్ తేజ్ కలిసి నటించిన బ్రో మూవీలో నటించింది ఈ అమ్మాయి.. ఇందులో సాయి ధరమ్ తేజ్ రెండవ చెల్లిగా కనిపించింది. మొదటి సిస్టర్ ప్రియా ప్రకాష్ వారియర్ కాగా.. మరో చెల్లెలు యువలక్ష్మి. బ్రో సినిమాలో ఆమె పాత్రకు ఎక్కువ స్కోప్ ఉంది. అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకులను కట్టిపడేసింది. కానీ ఈ సినిమా తర్వాత తెలుగులో మరో సినిమా చేయలేదు. ఈ బ్యూటీకి టాలీవుడ్ లో ఆఫర్స్ కూడా రాలేదు. ఇదంతా పక్కన పెడితే ప్రస్తుతం ఇప్పడిప్పుడే తమిళంలో హీరోయిన్ ఆఫర్స్ అందుకుంటుంది యువలక్ష్మి. కోలీవుడ్ లో మానవన్ సినిమాలో నటిస్తుంది.

బాలనటిగా కెరీర్ స్టార్ట్ చేసింది యువలక్ష్మి. తమిళంలో సముద్రఖని, అమలా పాల్ కలిసి నటించిన అమ్మ కనక్కు సినిమాలో నటించింది. ఇందులో అమలా పాల్ కూతురిగా కనిపించింది. ఆ తర్వాత కాంజన 3, వినోదయ సీతమ్ చిత్రాల్లో నటించింది. యువలక్ష్మి నటించిన చిత్రాలన్ని సూపర్ హిట్ అయ్యాయి. కానీ అంతగా అవకాశాలు మాత్రం రాలేదు. ప్రస్తుతం యువలక్ష్మి లేటేస్ట్ ఫోటోస్ నెట్టింట వైరలవుతున్నాయి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.