Urfi Javed: మూడేళ్ళుగా ఆ పని చేయలేదు.. కనీసం ఎవ్వరినీ ముద్దుకూడా పెట్టుకోలేదు.. ఉర్ఫీ జావేద్ షాకింగ్ కామెంట్స్

|

Aug 27, 2024 | 4:30 PM

విచిత్రమైన వేషధారణతో ఎప్పుడు హాట్ టాపిక్‌గా మారుతుంది ఈ అమ్మడు. రకరకాల వస్తువులతో డ్రస్సులు డిజైన్ చేసుకుంటూ ఎప్పుడూ వార్తల్లో ఉంటుంది ఈ చిన్నది. తాజాగా ఈ బ్యూటీ 'ఫాలో కర్ లో యార్' అనే షో చేసింది. ఇందులో ఆమె మాట్లాడుతూ చాలా ఆసక్తికర విషయాలను పంచుకుంది..

Urfi Javed: మూడేళ్ళుగా ఆ పని చేయలేదు.. కనీసం ఎవ్వరినీ ముద్దుకూడా పెట్టుకోలేదు.. ఉర్ఫీ జావేద్ షాకింగ్ కామెంట్స్
Urfi Javed
Follow us on

బాలీవుడ్ నటి ఉర్ఫీ జావేద్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ బ్యూటీ నిత్యం ఎదో రకంగా వార్తల్లో ఉంటుంది. ముఖ్యంగా విచిత్రమైన వేషధారణతో ఎప్పుడు హాట్ టాపిక్‌గా మారుతుంది ఈ అమ్మడు. రకరకాల వస్తువులతో డ్రస్సులు డిజైన్ చేసుకుంటూ ఎప్పుడూ వార్తల్లో ఉంటుంది ఈ చిన్నది. తాజాగా ఈ బ్యూటీ ‘ఫాలో కర్ లో యార్’ అనే షో చేసింది. ఇందులో ఆమె మాట్లాడుతూ చాలా ఆసక్తికర విషయాలను పంచుకుంది.. తన వ్యక్తిగత జీవితం గురించి కూడా మాట్లాడింది ఉర్ఫీ జావేద్. గత మూడేళ్లుగా తనకు శారీరక సుఖం లేదు అని చెప్పింది ఉర్ఫీ జావేద్. దీనికి ఆమె  చెప్పిన కారణం విని అంతా షాక్ అయ్యారు. ఉర్ఫీ జావేద్ మాట్లాడుతూ..

ఇది కూడా చదవండి : రవితేజ పక్కన లవర్‌గా, వదిన నటించిన స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా.?

గత మూడేళ్లుగా నేను సెక్స్‌లో పాల్గొనలేదు లేదు. ఈ మూడేళ్లలో నేను ఎవరినీ కనీసం ముద్దుపెట్టుకోలేదు అని చెప్పింది ఈ బ్యూటీ. అలాగే  తాను ఏ వ్యక్తితోనూ రొమాంటిక్‌గా మాట్లాడలేదని చెప్పింది.దీనికి కారణం కూడా ఉందని చెప్పుకొచ్చింది ఉర్ఫీ జావేద్. ‘నేను శారీరక సంబంధం పెట్టుకోకపోవడానికి కారణం ఉంది. నాకు ప్రైవేట్ జెట్ వచ్చేంత వరకు శారీరక సంబంధం పెట్టుకోకూడదని మూడేళ్ల క్రితమే ప్రమాణం చేశాను’ అని చెప్పుకొచ్చింది.

ఇది కూడా చదవండి : Ram Charan: అమ్మబాబోయ్..! రామ్ చరణ్ సిస్టర్ దుమ్మురేపిందిగా.. ఫోజులు చూస్తే ఫ్యూజులు ఎగరాల్సిందే

‘నేను ఆత్మగౌరవంతో ఉన్నాను. నా జీవితంలో అన్నీ నేనే చేశాను. నా భాగస్వామితో బలహీనంగా కనిపించడం నాకు ఇష్టం ఉండదు’ అని ఉర్ఫీ తెలిపింది. గతంలో ఉర్ఫీ జావేద్ పరాస్ కల్నావత్‌తో రిలేషన్‌షిప్‌లో ఉంది. ఈ ఇద్దరూ 2017 నుంచి 2022 వరకు డేటింగ్ చేశారు. ఆ తర్వాత విడిపోయారు. ఇక బిగ్ బాస్ ఓటీటీలో పాల్గొంది ఈ చిన్నది. ఆ తర్వాత ఆమె క్రేజ్ మరింత పెరిగింది. అక్కడి నుంచి సినిమా ఛాన్స్ ల కోసం వింత బట్టలు వేసుకోవడం మొదలుపెట్టింది. ఇక మూడేళ్ళుగా సెక్స్ లో పాల్గొనలేదు అని ఈ అమ్మడు చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. దీని పై నెటిజన్స్ రకరకాల కామెంట్స్ చేస్తున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.