Akshay Kumar: పేదలకు అన్నదానం నిర్వహించిన స్టార్ హీరో .. స్వయంగా ప్లేట్లలో వడ్డించి మరీ.. వీడియో వైరల్
బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. సినిమాలు వేగంగా కంప్లీట్ చేయడంలో ఆరితేరిన ఈ ఈ సీనియర్ హీరో తెలుగు వారికి కూడా సుపరిచితమే. త్వరలోనే కన్నప్ప సినిమాతో నేరుగా తెలుగు ఆడియెన్స్ ను పలకరించేందుకు సిద్ధమైపోతున్నాడు అక్షయ్. సినిమాలతో పాటు సామాజిక సేవా కార్యక్రమాలు చేయడంలో ఈ స్టార్ హీరో ముందుంటాడు.
![Akshay Kumar: పేదలకు అన్నదానం నిర్వహించిన స్టార్ హీరో .. స్వయంగా ప్లేట్లలో వడ్డించి మరీ.. వీడియో వైరల్](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/08/actor-akshay-kumar.jpg?w=1280)
బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. సినిమాలు వేగంగా కంప్లీట్ చేయడంలో ఆరితేరిన ఈ ఈ సీనియర్ హీరో తెలుగు వారికి కూడా సుపరిచితమే. త్వరలోనే కన్నప్ప సినిమాతో నేరుగా తెలుగు ఆడియెన్స్ ను పలకరించేందుకు సిద్ధమైపోతున్నాడు అక్షయ్. సినిమాలతో పాటు సామాజిక సేవా కార్యక్రమాలు చేయడంలో ఈ స్టార్ హీరో ముందుంటాడు. కొన్ని రోజుల క్రితం కష్టాల్లో ఉన్న సింగర్ గ్లోరీ బవాకు ఏకంగా 25 లక్షలు సహాయం చేశాడు. ఇప్పుడు మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నాడీ సీనియర్ యాక్టర్. ముంబైలోని తన ఇంటి ఆవరణలో అన్నదానం నిర్వహించిన అక్షయ్ స్వయంగా అందరికీ ప్లేటులో భోజనం వడ్డించి ఇచ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది చూసిన అభిమానులు, నెటిజన్లు అక్షయ్‌పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ‘అక్షయ్ అన్నా.. నువ్వు చాలా ట్రేట్.. నువ్వు మా మనసులు గెల్చుకున్నావ్.. నీది చాలా గొప్ప మనసు’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
ఇదిలా ఉంటే గత రెండేళ్లుగా వరుసగా ప్లాఫులు ఎదుర్కొంటున్నాడు అక్షయ్ కుమార్. ఆయన నటించిన సినిమాలు వరుసగా బోల్తా కొడుతున్నాయి. ఇటీవల ఎన్నో ఆశలు పెట్టుకున్న సర్ఫిరా కూడా అభిమానులను బాగా నిరాశపర్చింది. అంతకు ముందు బడే మియా చోటే మియా, ది రాణిగంజ్ చిత్రాలు కూడా ప్లాఫ్స్ గా నిలిచాయి. దీంతో అక్షయ్ ఆశలన్నీ ఇప్పుడు ఖేల్ ఖేల్ మే సినిమాపై నే ఉన్నాయి. అన్ని హంగులు పూర్తి చేసుకున్న ఈ సినిమా స్వాతంత్ర్య దినోత్సవం కానుకగా ఆగస్టు 15న థియేటర్లలో విడుదల కానుంది. ఇందులో వాణి కపూర్, తాప్సీ, అమ్మీ విర్క్, ఫర్దీన్ ఖాన్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు.
వీడియో ఇదిగో..
Video: @akshaykumar sir spotted feeding needy people in Mumbai today. pic.twitter.com/HDk2ta7X7g
— Akshay Kumar 24×7 (@Akkistaan) August 6, 2024
ఖేల్ ఖేల్ మే సినిమాలో అక్షయ్ కుమార్..
Hassi aur masti ke bina khel, khel nahi, aur doston ke bina koi fun nahi! 😉 #HappyFriendshipDay#KhelKhelMein trailer out now – https://t.co/8G9Yv8iifS#KhelKhelMein releasing in cinemas on 15th August 2024.#GameIsOn pic.twitter.com/YVJ9htjYrp
— Akshay Kumar (@akshaykumar) August 4, 2024
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.