Game Changer : మెగా ఫ్యాన్స్‏కు గుడ్ న్యూస్.. ఎట్టకేలకు గేమ్ ఛేంజర్ అప్డేట్ ఇచ్చిన మేకర్స్..

మెగా హీరో రామ్ చరణ్ హీరోగా డైరెక్టర్ శంకర్ రూపొందిస్తున్న సినిమా గేమ్ ఛేంజర్. ట్రిపుల్ ఆర్ వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత చరణ్ నటిస్తోన్న ఈ మూవీపై ముందు నుంచి భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, జరగండి సాంగ్ మూవీపై మరిన్ని అంచనాలను క్రియేట్ చేశాయి. కానీ ఈ సినిమా విషయంలో మాత్రం మెగా ఫ్యాన్స్ ఎంతో నిరుత్సాహంలో ఉన్నారు. సినిమా రెగ్యూలర్ షూటింగ్ మొదలై మూడేళ్లు […]

Game Changer : మెగా ఫ్యాన్స్‏కు గుడ్ న్యూస్.. ఎట్టకేలకు గేమ్ ఛేంజర్ అప్డేట్ ఇచ్చిన మేకర్స్..
Game Changer
Follow us

|

Updated on: Aug 07, 2024 | 4:37 PM

మెగా హీరో రామ్ చరణ్ హీరోగా డైరెక్టర్ శంకర్ రూపొందిస్తున్న సినిమా గేమ్ ఛేంజర్. ట్రిపుల్ ఆర్ వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత చరణ్ నటిస్తోన్న ఈ మూవీపై ముందు నుంచి భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, జరగండి సాంగ్ మూవీపై మరిన్ని అంచనాలను క్రియేట్ చేశాయి. కానీ ఈ సినిమా విషయంలో మాత్రం మెగా ఫ్యాన్స్ ఎంతో నిరుత్సాహంలో ఉన్నారు. సినిమా రెగ్యూలర్ షూటింగ్ మొదలై మూడేళ్లు గడుస్తున్నప్పటికీ ఇప్పటివరకు ఎలాంటి అప్డేట్స్ ఇవ్వలేదు. కేవలం సినిమా నుంచి ఒక్క సాంగ్ మినహా మరో అప్డేట్ రాలేదు. దీంతో చిత్రయూనిట్ తీరుపై ఫ్యాన్స్ అసహనం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే కొద్దిరోజుల క్రితం గేమ్ ఛేంజర్ మూవీ రిలీజ్ డేట్ ప్రకటిస్తూ అభిమానులను ఖుషీ చేసిన మేకర్స్.. అలాగే అటు షూటింగ్ కూడా కంప్లీట్ అయినట్లు తెలిపారు.

తాజాగా గేమ్ ఛేంజర్ సినిమా నుంచి మరో అప్డేట్ ఇచ్చారు. లేటేస్ట్ సమాచారం ప్రకారం ఈ సినిమా డబ్బింగ్ వర్క్ స్టార్ట్ చేసినట్లు తెలిపారు. నిర్మాత దిల్ రాజు పూజా కార్యక్రమాలతో ఈరోజు డబ్బింగ్ పనులు స్టార్ట్ చేసినట్లు తెలిపారు. దీంతో అటు షూటింగ్ అయిపోవడం.. ఇటు డబ్బింగ్ వర్క్ షూరు చేయడంతో త్వరలోనే గేమ్ ఛేంజర్ సినిమాను నుంచి వరుస అప్డేట్స్ రావడం ఖాయమని ఖుషి అవుతున్నారు ఫ్యాన్స్. డబ్బింగ్ వర్క్ ఫోటోస్ షేర్ చేసిన మేకర్స్.. మరోసారి రిలీజ్ డేట్ పై స్పష్టతనిచ్చారు.

ఇవి కూడా చదవండి

ముందుగా ప్రకటించినట్లుగానే ఈ చిత్రాన్ని ఈ ఏడాది చివర్లో క్రిస్మస్ సందర్భంగా రిలీజ్ చేయనున్నట్లు తెలిపారు. అలాగే ఈ మూవీ నుంచి సెకండ్ సాంగ్ ఈ నెల చివరలో రిలీజ్ చేయనున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.