ప్రముఖ బాలీవుడ్ నటుడు తన విశాల హృదయాన్ని చాటుకున్నాడు. దీపావళి పండగ సందర్భంగా అయోధ్యలోని కోతుల ఆహరం కోసం భారీ విరాళం ప్రకటించాడు. అయోధ్య రామాలయానికి వచ్చే భక్తులను వానరసేన ఇబ్బంది పెట్టకుండా… అలాగే ఆకలితో ఉన్న వానరసేనకు ఆహారం కోసం కోటి రూపాయల విరాళం అందించాడు. అంతేకాదు కోతుల ఆహారం కోసం ప్రత్యేకంగా ఒక ఫీడింగ్ వ్యాన్ ను కూడా అందజేశాడు. కాగా అయోధ్య వానరసేనకు అక్షయ్ కుమార్ ఆహారం పెట్టడం ఇదేమి మొదటిసారి కాదు. బాలరాముడి ఆలయ ప్రారంభమైనప్పటినుంచి ఈ మంచి పనికి శ్రీకారం చుట్టాడు అక్షయ్. అయోధ్యతో పాటు శివారులోని సురక్షిత ప్రాంతంలో దాదాపు 1,200 కోతులకు నిత్యం పౌష్ఠికాహారం అందిస్తున్నాడీ సీనియర్ హీరో. ‘ అయోధ్యలో ఆహారం కోసం కోతులు ఎదుర్కొంటున్న సమస్యల గురించి తెలిసినప్పుడు నాకు చాలా బాధగా అనిపించింది. వాటి కోసం నా వంతు కృషి చేయాలనుకుంటున్నాను. అందులో భాగంగానే దీపావళి సందర్భంగా మా అమ్మానాన్నలకు నివాళులు అర్పిస్తూ వారి పేరిట వానరసేనకు ఆహారం అందించే ఏర్పాచేశాను. దీనిని చూసి తన తల్లిదండ్రులు ఎక్కడ ఉన్నా సంతోషిస్తారు’ అని చెప్పుకొచ్చాడు అక్షయ్.
కాగా అయోధ్యలో ఆంజనేయ సేవా ట్రస్ట్ నిర్వహిస్తున్న జగత్గురు స్వామి రాఘవాచార్య జీ మహారాజ్ మార్గదర్శకత్వంలో అక్షయ్ ఈ మంచి పనికి శ్రీకారం చుట్టాడు అక్షయ్. ట్రస్ట్‌లోని సభ్యులు అక్షయ్‌ను సంప్రదించినప్పుడు.. అతను వెంటనే విరాళం ఇవ్వాలని నిర్ణయించుకున్నాడని వారు తెలిపారు. ఈ సందర్భంగా ట్రస్ట్ వ్యవస్థాపకులు సభ్యులు అక్షయ్ ను ప్రశంసించారు.
Akshay Sir, our idol has once again won our hearts by donating 1 crore to feed the sacred monkeys in Ayodhya ♥️#AkshayKumar #AkshayKumar #AkshayKumar𓃵 pic.twitter.com/oUQosdfzUk
— AK Squad (@its_aksquad) October 29, 2024
Imagine meeting the world’s biggest authority on Artificial Intelligence and ending up chatting about martial arts!! What an amazing man you are Mr. #JensenHuang. Now I know why @nvidia is the absolute giant that it is. 😊👍🏻 pic.twitter.com/h54V42QiTo
— Akshay Kumar (@akshaykumar) October 24, 2024
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.