Bigg Boss Telugu 10: ఒకే ఒక్క స్టేట్మెంట్‌తో సోషల్ మీడియాలో సెన్సేషన్.. బిగ్‌బాస్ 10లోకి ఈ బ్యూటీ పక్కా!

బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 కంటెస్టెంట్స్ ఎవరన్నది ఆసక్తికరంగా మారింది. సోషల్ మీడియాలో చాలా పేర్లు వినిపిస్తున్నప్పటికీ కచ్చితంగా ఎవరు హౌస్ లోకి ఎంట్రీ ఇస్తారన్నది క్లారిటీ లేదు. అయితే తన సంచలన స్టెట్మెంట్స్ తో తరచూ వార్తల్లో నిలిచే ఓ పాపులర్ పర్సనాలిటీ మాత్రం పక్కాగా హౌస్ లోకి రానుందని తెలుస్తోంది.

Bigg Boss Telugu 10: ఒకే ఒక్క స్టేట్మెంట్‌తో సోషల్ మీడియాలో సెన్సేషన్.. బిగ్‌బాస్ 10లోకి ఈ బ్యూటీ పక్కా!
Bigg Boss Telugu 10

Updated on: Aug 06, 2026 | 7:57 PM

బుల్లితెర ప్రేక్షకుల ఫేవరెట్ టీవీ రియాలిటీ బిగ్ బాస్ మళ్లీ వస్తోంది. తెలుగులో తొమ్మిది సీజన్లు పూర్తి చేసుకున్న ఈ సెలబ్రిటీ రియాలిటీ షో పదో సీజన్ త్వరలోనే షురూ కానుంది. ప్రస్తుతమున్న సమాచారం ప్రకారం సెప్టెంబర్ మొదటి వారంలో బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 గ్రాండ్ లాంఛింగ్ ఉండనుంది. ల్యాండ్ మార్క్( పదో) సీజన్ కావడంతో ఈసారి హౌస్ లో చాలా మార్పులు ఉండనున్నాయని తెలుస్తోంది. గేమ్స్ ,టాస్కుల నిర్వహణలో సరికొత్త కాన్సెప్టులు జోడించనున్నారని తెలుస్తోంది. అలాగే కంటెస్టెంట్ల ఎంపికలోనూ పలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మరోవైపు బిగ్ బాస్ సీజన్ 10 దశావతారంలో కంటెస్టెంట్స్ గా ఎవరు వస్తారన్నది ఆసక్తికరంగా మారింది. సోషల్ మీడియాలో చాలా మంది పేర్లే వినిపిస్తున్నాయి. బుల్లితెర సెలబ్రిటీలతో పాటు పేరు మోసిన యూట్యూబర్లు, సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్లు ఈసారి హౌస్ లో సందడి చేయనున్నారని తెలుస్తోంది. అయితే బిగ్ బాస్ సీజన్ 10 దశావతారం అంటూ సరికొత్తగా రాబోతున్న సీజన్ లో ఓ పాపులర్ పర్సరాలిటీ ఎంట్రీ ఇవ్వనుందని వినిపిస్తుంది. ఆమె ఎవరో కాదు ప్రముఖ రచయిత్రి, గేయ రచయిత కడలి సత్యనారాయణ

కడలి సత్యనారాయణ.. సాధారణ ఆడియెన్స్ కు ఈమె గురించి పెద్దగా తెలియకపోవచ్చు.. కానీ సోషల్ మీడియాను ఫాలో అయ్యేవారికి ఈ యంగ్ రైటర్ కమ్ లిరిసిస్ట్ బాగానే పరిచయం. చూడడానికి అల్ట్రా మోడన్ అమ్మాయిలా కనిపించే కడలికి తెలుగు భాషంటే ప్రాణం. అందుకే రెండు తెలుగు పుస్తకాలను కూడా రచింది జెన్-జీ యువతను కూడా తెలుగు పుస్తక ప్రియులుగా మార్చేసింది. ఆమె రచించిన కడలి కథలు, లెటర్స్ టూ లవ్ బుక్స్ కు మార్కెట్లో బాగా డిమాండ్ ఉంది. ఇదిలా ఉంటే ప్రస్తుతం తెలుగు సినిమాలకు లిరిసిస్ట్ గానూ, డైలాగ్ రైటర్ గానూ వర్క్ చేస్తోంది కడలి. అర్ధశతాబ్ధం, మదిలో వంటి ఫీల్ గుడ్ సినిమాలకు ఆమె పాటలతో పాటు డైలాగులు కూడా అందించింది.

ఇవి కూడా చదవండి

కడలి సత్యనారాయణ లేటెస్ట్ ఇన్ స్టా గ్రామ్ పోస్ట్..

 

కాగా గతంలో ఫెమినిజంపై కడలి చేసిన కొన్ని వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. ‘ఆడవాళ్లకు సొంత ఇల్లు ఉండదు. ఉంటే అది తండ్రి ఇల్లు లేదా భర్త ఇల్లు. కానీ ఆడవాళ్లకు అంటూ ఒక సొంత ఇల్లు ఉండదు’ అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. ఈ వ్యాఖ్యలతో కడలి సత్యనారాయణ పేరు మరింత మార్మోగిపోయింది. సామాజిక అంశాలపై తన అభిప్రాయాలను నిర్మొహమాటంగా చెప్పడం కడలికి మంచి గుర్తింపు తీసుకొచ్చింది. ఈ క్రమంలోనే ఆమెను బిగ్ బాస్ లోకి తీసుకొస్తే రియాలిటీ షోకు ఆదరణ పెరుగుతుందని నిర్వాహకులు భావిస్తున్నారు. మరి బిగ్ బాస్ 10లో కడలి వస్తుందో లేదో తెలుసుకోవాలంటే గ్రాండ్ లాంఛింగ్ వరకు ఆగాల్సిందే.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Loading...
Unable to load recommendations.
Follow Us