Siri Hanmanth: మళ్లీ కలిసిపోయారే.. బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి లగ్జరీ కారు కొన్న బిగ్‌బాస్‌ బ్యూటీ.. నెట్టింట్లో ఫొటోలు వైరల్‌..

Siri Hanmanth:  బిగ్‌బాస్‌ తెలుగు రియాలిటీ షోతో మంచి గుర్తింపు తెచ్చుకున్నవాళ్లలో సిరి హన్మంత్‌ (Siri Hanmanth) కూడా ఒకరు. అప్పటివరకు కేవలం వెబ్‌సిరీస్‌లు, చిన్న చిన్న సీరియల్స్‌లో మాత్రమే కనిపించిన ఆమె బిగ్‌బాస్‌తో ఎనలేని క్రేజ్‌ను తెచ్చుకుంది

Siri Hanmanth: మళ్లీ కలిసిపోయారే.. బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి లగ్జరీ కారు కొన్న బిగ్‌బాస్‌ బ్యూటీ.. నెట్టింట్లో ఫొటోలు వైరల్‌..
Siri Hanmanth

Updated on: Jul 13, 2022 | 6:15 PM

Siri Hanmanth:  బిగ్‌బాస్‌ తెలుగు రియాలిటీ షోతో మంచి గుర్తింపు తెచ్చుకున్నవాళ్లలో సిరి హన్మంత్‌ (Siri Hanmanth) కూడా ఒకరు. అప్పటివరకు కేవలం వెబ్‌సిరీస్‌లు, చిన్న చిన్న సీరియల్స్‌లో మాత్రమే కనిపించిన ఆమె బిగ్‌బాస్‌తో ఎనలేని క్రేజ్‌ను తెచ్చుకుంది. ముఖ్యంగా బిగ్‌బాస్‌ హౌస్‌లో యూట్యూబర్‌ షణ్ముక్‌తో నడిపిన ప్రేమాయణం, ఆ తర్వాత షన్ను, దీప్తి సునైనా విడిపోవడానికి ఆమె కారణమంటూ వచ్చిన వార్తలతో మరింత పాపులర్‌ అయ్యింది. బిగ్‌బాస్లో షన్ను, సిరిల మధ్య ఉన్న బంధాన్ని చూసి సిరి బాయ్‌ఫ్రెండ్‌ శ్రీహన్‌ (Shrihan) కూడా ఆమెకు బ్రేకప్‌ చెప్పినట్లు వార్తలు వచ్చాయి. శ్రీహన్‌ తన సోషల్‌ మీడియా అకౌంట్‌లో సిరి ఫొటోలు, వీడియోలు తొలగించడం ఈ వార్తలకు మరిన్ని బలాన్నిచ్చాయి. అయితే విడిపోయిన ఈ జంట ప్రస్తుతం మళ్లీ కలుసుకున్నారని తెలుస్తోంది.

ముందు డ్రైవింగ్‌ నేర్చుకో..
తాజాగా సిరి ఒక లగ్జరీ కారును కొనుగోలు చేసింది. అదికూడా శ్రీహన్‌తో కలిసి. ఈ కారు విలువ సుమారు రూ. 20 లక్షల వరకు ఉంటుందని తెలుస్తోంది. ఇక ఈ విషయాన్ని శ్రీహన్ ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా అభిమానులతో షేర్‌ చేసుకున్నాడు. ‘మా ఇంటికి స్వాగతం MG హెక్టార్.. సిరి హన్మంత్‌కు అభినందనలు.. ముందు డ్రైవింగ్ నేర్చుకో’ అంటూ సెటైర్‌ వేశాడు. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట్లో వైరల్‌గా మారాయి. ఈ జంట మళ్లీ కలిసిపోయినందుకు చాలా సంతోషంగా ఉందంటూ ఫ్యాన్స్‌ కామెంట్లు పెడుతున్ఆనరు. వీరిలానే షన్నూ, దీప్తి కూడా కలిసి పోతే బాగుండు అంటూ ఆకాంక్షిస్తున్నారు.

మరిన్ని ఎంటర్ టైన్మెంట్ వార్తల కోసం క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us