సోషల్ మీడియా చేతికి వచ్చిన తర్వాత ప్రపంచం మరింత చిన్నదైపోయింది. అయితే సోషల్ మీడియా కారణంగా ఎన్ని లాభాలుంటాయి అన్ని అనర్ధాలు కూడా ఉంటాయి. ఇప్పటికే సోషల్ మీడియా కారణంగా ఎంతో మంచి ఇబ్బందులకు గురయ్యారు. ముఖ్యంగా సినిమా సెలబ్రెటీలు సోషల్ మీడియా వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. హీరోయిన్స్ వ్యక్తిగత జీవితం గురించి కూడా సోషల్ మీడియాలో ఎదో ఒక వార్త హల్ చల్ చేస్తుంటాయి. వారి ప్రైవేట్ విషయాలు కూడా నెట్టింట్లో దర్శమిస్తుంటాయి. తాజాగా సోషల్ మీడియా కారణంగా ఒక నటి కెరీర్ నాశనం అయ్యిందని ఆవేదన వ్యక్తం చేసింది. ఆమె ప్రైవేట్ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. అయితే అది తనది కాదు అని ఎవరో మార్ఫింగ్ చేశారు అని ఆమె పోలీసులను ఆశ్రయించింది.
ఇంతకు ఆ నటి ఎవరా అనుకుంటున్నారా.? ఆమె పేరుప్రియాంక పండిత్ .. భోజ్ పూరి నటి. ప్రియాంక సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. నెట్టింట ఆమెకు విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. రోజూ గ్లామరస్ ఫోటోలు షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది ఈ చిన్నది.
అయితే గత ఏడాది ఈ అమ్మడికి సంబంధించిన ప్రైవేట్ వీడియో సోషల్ మీడియాలో దర్శనమిచ్చింది. ఆమెతో పాటు మరికొంతమంది నటీమణులవి కూడా వీడియోలు చక్కర్లు కొట్టాయి. అయితే ఆ వీడియోలో ఉంది తాను కాదని.. కావాలనే తనను టార్గెట్ చేసి మార్ఫింగ్ వీడియోలు ఫోటోలు షేర్ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. ఆ వీడియో కారణంగా తన కెరీర్ నాశనం అయ్యిందని చెప్పుకొచ్చింది ప్రియాంక ఆ కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి.