మాస్ మసాలా సినిమాలు తీయలేరా.. అని ఆ హీరోయిన్ అడిగింది.. కట్ చేస్తే బ్లాక్ బస్టర్ మూవీ చేశారు

సీనియర్ హీరో భాను చందర్ గురించి తెలుగు ఆడియెన్స్ కు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. 80-90వ దశకంలో తెలుగు, తమిళ్ భాషల్లో స్టార్ హీరోగా వెలుగొందారాయన. కరాటేలో బ్లాక్ బెల్ట్ సాధించిన ఈ నటుడు యాక్షన్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిపోయారు.

మాస్ మసాలా సినిమాలు తీయలేరా.. అని ఆ హీరోయిన్ అడిగింది.. కట్ చేస్తే బ్లాక్ బస్టర్ మూవీ చేశారు
Bhanu Chander

Updated on: Oct 16, 2026 | 8:53 PM

తెలుగు సినీ పరిశ్రమలో విలక్షణమైన పాత్రలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు భానుచందర్. ఆయన గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా ఆయన నటించిన కొన్ని చిత్రాలు ప్రేక్షకుల మనసుల్లో చెరగని ముద్ర వేశాయి. అయితే భానుచందర్ సినీ ప్రయాణంలో దర్శకుడు బాలు మహేంద్రతో ఆయనకు ఉన్న అనుబంధం ఎంతో ప్రత్యేకమైనది. ఈ ఇద్దరి కలయికలో వచ్చిన నీంగళ్ కేట్టవే, నిరీక్షణ చిత్రాలు నటుడిగా భానుచందర్‌కు కొత్త గుర్తింపును తీసుకొచ్చాయి. గతంలో ఓ ఇంటర్వ్యూలో ఆయన పలు ఆసక్తికర కామెంట్స్ చేశారు. బాలు మహేంద్ర అంటే సహజత్వానికి పెద్దపీట వేసే సినిమాలు, హృదయానికి హత్తుకునే కథలు గుర్తుకొస్తాయి. ఆయన చిత్రాల్లో పాత్రల భావోద్వేగాలు, సహజమైన సన్నివేశాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచేవి.

అయితే ఆయన కేవలం సీరియస్ కథలకే పరిమితమనే అభిప్రాయం కూడా సినీ వర్గాల్లో ఉండేది. ఈ నేపథ్యంలోనే నటి సిల్క్ స్మిత అడిగిన ఓ ప్రశ్న ఆసక్తికరమైన మలుపునకు కారణమైంది. బాలు మహేంద్ర మసాలా సినిమా తీయలేరా అని సిల్క్ స్మిత నేరుగా ప్రశ్నించారట. అందుకు ఆయన తనదైన శైలిలో స్పందిస్తూ, అలాంటి సినిమాలు తీయడం తనకు పెద్దగా ఇష్టం లేదని, అది తనకు అలవాటైన ప్రక్రియ కాదని చెప్పినట్లు భానుచందర్ వెల్లడించారు. అయితే ఆమె అడిగినందున ఒకసారి ప్రయత్నించేందుకు అంగీకరించారని తెలిపారు. అలా రూపొందిన చిత్రమే నీంగళ్ కేట్టవే.

నీంగళ్ కేట్టవే చిత్రంలో భానుచందర్‌ను మార్షల్ ఆర్ట్స్ తెలిసిన వ్యక్తిగా చూపించగా, త్యాగరాజన్ పాత్రను గాయకుడిగా తీర్చిదిద్దారు. సాధారణంగా బాలు మహేంద్ర సినిమాల్లో కనిపించే భావోద్వేగాలకు భిన్నంగా, ఈ చిత్రంలో కమర్షియల్ అంశాలకు కూడా ప్రాధాన్యం ఇచ్చారు. కథను తెరకెక్కించిన విధానం, పాత్రల రూపకల్పన ఈ సినిమాకు ప్రత్యేకతను తీసుకొచ్చాయి. ఈ చిత్రం తన కెరీర్‌లో ముఖ్యమైన స్థానాన్ని సంపాదించిందని భానుచందర్ పేర్కొన్నారు. బాలు మహేంద్ర తనలోని నటుడిని విభిన్న కోణాల్లో ఆవిష్కరించేందుకు చేసిన ప్రయత్నాలు ఎంతో విలువైనవని ఆయన గుర్తుచేసుకున్నారు.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us