Puneeth Rajkumar: అప్పు మరణ వార్త విని ఓ అభిమాని మృతి..బెంగళూరులో రేపటి వరకూ మద్యం అమ్మకాలపై నిషేధం

Puneeth Rajkumar: కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ ఆకస్మిక మరణంతో కన్నడ చిత్ర సీమ మాత్రమే కాదు..  దక్షిణాది సినీ పరిశ్రమ శోక సంద్రంలో...

Puneeth Rajkumar: అప్పు మరణ వార్త విని ఓ అభిమాని మృతి..బెంగళూరులో రేపటి వరకూ మద్యం అమ్మకాలపై నిషేధం
Puneeth Rajkumar

Updated on: Oct 30, 2021 | 9:12 AM

Puneeth Rajkumar: కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ ఆకస్మిక మరణంతో కన్నడ చిత్ర సీమ మాత్రమే కాదు..  దక్షిణాది సినీ పరిశ్రమ శోక సంద్రంలో మునిగిపోయింది.  తమ అభిమాన హీరో అప్పు ఇక లేరనే వార్తను ఆయన అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.  పునీత్ ను చివరిసారి దర్శించుకుని తుది వీడ్కోలు చెప్పడానికి అభిమానులు భారీగా బెంగళూరులోని కంఠీరవ స్టేడియాని వస్తున్నారు. అయితే పునీత్ గుండెపోటుతో ఆసుపత్రిలో చేరారు అన్నవార్త వెలువడిన వెంటనే అభిమానులు విక్రమ్ హాస్పిటల్‌ వద్దకు పరుగులు తీశారు.

గత అనుభవాల దృష్ట్యా పునీత్ ఆరోగ్య పరిస్థితి విషయం అన్నవార్తలు వెలువడిన వెంటనే కర్ణాటక సర్కార్ కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టింది. అప్పటిలో పునీత్ తండ్రి లెజెండరీ యాక్టర్ రాజ్ కుమార్ మరణించిన సమయంలో అభిమానులు సృష్టించిన విధ్వసాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకుంది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో బారికేడ్లు ఏర్పాటు చేసింది. పహారా పెంచింది. అంతేకాదు.. పునీత్ రాజ్‌కుమార్ మరణవార్త వినగానే కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకొన్నది. రాష్ట్రవ్యాప్తంగా మూడు రోజులపాటు మద్యపాన నిషేధం విధించింది.  దీంతో కర్ణాటకలో రేపటి వరకూ మద్యం అమ్మకాలపై నిషేధం అమలు కానున్నది. అభిమానులు మద్యం మత్తుల్లో దాడులు, విధ్వంసానికి పాల్పడకుండా ముందు జాగ్రత్తగా ముందు అమ్మకాలపై నిషేధం విధించింది.

అయితే తన అభిమాన హీరో ఇక లేరు అనే వార్తను విని ఓ అభిమాని గుండెపోటుతో మృతి చెందాడు. పొన్నాచి తాలుకాలోని మరూరుకు చెందిన మునియప్ప కు పునీత్ అంటే చాలా ఇష్టం.. పునీత్‌ను అమితంగా ఆరాధించే మునియప్పకు  అప్పు  మరణించారు అన్న వార్తవినగానే గుండెపోటు వచ్చింది.  మునియప్పను వెంటనే సమీప ఆస్పత్రికి తరలించినా ఫలితం లేకపోయింది. అప్పటికే మునియప్ప చనిపోయినట్లు వైద్యులు చెప్పారు. మునియప్పకు ఏడాది వయసు ఉన్న కుమార్తె ఉన్నట్లు తెలుస్తోంది. రేపు పునీత్ అంత్యక్రియలు జరిపించనున్నారు.

Also Read:  మరణించే ముందు రాత్రి బర్త్ డే పార్టీలో పునీత్.. జీవితం అనూహ్యమైంది అంటూ చివరి వీడియో వైరల్

 

Follow Us