Bangarraju Pre Release Event: సంక్రాంతి సందడికి సిద్దమైన బంగార్రాజులు.. గ్రాండ్ గా ప్రీరిలీజ్ ఈవెంట్..

సోగ్గాడే చిన్ని నాయన సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నారు కింగ్ నాగార్జున. ఇక ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ గా బంగార్రాజు మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు నాగార్జున.

Bangarraju Pre Release Event: సంక్రాంతి సందడికి సిద్దమైన బంగార్రాజులు.. గ్రాండ్ గా ప్రీరిలీజ్ ఈవెంట్..
Bangarraju
Follow us

|

Updated on: Jan 13, 2022 | 7:11 PM

Bangarraju: సోగ్గాడే చిన్ని నాయన సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నారు కింగ్ నాగార్జున. ఇక ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ గా బంగార్రాజు మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు నాగార్జున. సోగ్గాడే సినిమాకు దర్శకత్వం వహించిన కళ్యాణ్ కృష్ణనే ఈ బంగార్రాజును కూడా డైరెక్ట్ చేశారు. ఇక ఈ సినిమాలో నాగార్జున తోపాటు అక్కినేని యంగ్ హీరో నాగచైతన్య కూడా నటిస్తున్న విషయం తెలిసిందే. అన్నపూర్ణ స్టూడియోస్ ప్రై.లి., జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి నాగార్జున నిర్మాతగా వ్యవహరించారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పోస్టర్లు, టీజర్, పాటలు, ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఈ సినిమా సంక్రాంత్రి సందర్భంగా జనవరి 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో నాగార్జున సరసన రమ్యకృష్ణ నటిస్తుండగా చైతూకి జోడీగా కృతి శెట్టి అలరించనుంది.  ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ ఊపందుకున్నాయి.

తాజాగా ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ ను గ్రాండ్ గా ఏర్పాటు చేశారు. ఇక ఈ సినిమాలో నాగార్జున మనవడిగా కనిపించనున్నాడు చైతన్య. అచ్చం బంగార్రాజు పోలికలతోనే చైతన్య ఉండటం.. అమ్మాయిలతో సరసాలాడటం.. ఆడుతూ పడుతూ తిరగడం చూపించారు. ఇక అదే విధంగా ఈ సినిమాలో రమ్యకృష్ణ కూడా ఆత్మగా ఉండనున్నారని ట్రైలర్ చూస్తుంటే అర్ధమవుతుంది. నాగ చైతన్య కృత్ శెట్టి తో ప్రేమలో పడటం ఇంతలోనే అనుకోని ప్రమాదంలో చైతూ ఇరుక్కోవడంతో పైనుంచి బంగార్రాజు దిగడం..ఆ సమస్యను పరిష్కరించడం వంటివి ట్రైలర్ చూస్తే అర్ధమవ్వుతున్నాయి. ఇక ఈ సినిమాలో ఇప్పటివరకు విడుదల చేసిన పాటలన్ని ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో జరుగుతుంది. ఈ ఈవెంట్ ను ఇక్కడ లైవ్ చూడండి.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Raviteja: రామారావుతో కాలు కదపనున్న బాలీవుడ్ శృంగార తార.. సాంగ్ అద్భుతంగా వచ్చిందంటోన్న దర్శక నిర్మాతలు..

Akkineni Nagarjuna: సీఎం జగన్‌తో చిరంజీవి భేటీపై స్పందించిన నాగార్జున.. ఏమన్నారంటే..

Mohan Babu: గుడ్‏న్యూస్ చెప్పిన మోహన్ బాబు.. శ్రీ విద్యానికేతన్ కాలేజ్‏కీ యూనివర్సిటీ హోదా..