బండ్ల గణేశ్‌కు బెయిల్..ఆ నేత అండతో బయటకి..?

|

Oct 25, 2019 | 2:52 PM

బండ్ల గణేశ్‌కు బెయిల్ లభించింది. ఇందుకు అతనికి అత్యంత క్లోజ్ అయిన ఏపీ నేత ఒకరు చక్రం తిప్పినట్టు తెలుస్తోంది. అంతకుముందు కడప కోర్టు బండ్లకు 14 రోజుల రిమాండ్‌ను విధించింది. కోర్టు ఉత్తర్వుల ప్రకారం నవంబర్ 4 వరకూ ఆయన రిమాండ్ కొనసాగనుంది. కానీ అనూహ్యంగా అతడికి బెయిల్ లభించడం గమనార్హం. ప్రస్తుతం బండ్ల కడప నుంచి హైదరాబాద్ బయల్దేరారు. కేసు ఏంటంటే: 2011లో కడపకు చెందిన మహేష్ అనే వ్యక్తి దగ్గర బండ్ల గణేష్ […]

బండ్ల గణేశ్‌కు బెయిల్..ఆ నేత అండతో బయటకి..?
Follow us on

బండ్ల గణేశ్‌కు బెయిల్ లభించింది. ఇందుకు అతనికి అత్యంత క్లోజ్ అయిన ఏపీ నేత ఒకరు చక్రం తిప్పినట్టు తెలుస్తోంది. అంతకుముందు కడప కోర్టు బండ్లకు 14 రోజుల రిమాండ్‌ను విధించింది. కోర్టు ఉత్తర్వుల ప్రకారం నవంబర్ 4 వరకూ ఆయన రిమాండ్ కొనసాగనుంది. కానీ అనూహ్యంగా అతడికి బెయిల్ లభించడం గమనార్హం. ప్రస్తుతం బండ్ల కడప నుంచి హైదరాబాద్ బయల్దేరారు.

కేసు ఏంటంటే:

2011లో కడపకు చెందిన మహేష్ అనే వ్యక్తి దగ్గర బండ్ల గణేష్ 13 కోట్ల అప్పు తీసుకున్నాడు. డబ్బులు తిరిగి ఇవ్వకపోవడంతో బండ్ల గణేష్‌పై 2013లో మహేష్ చెక్ బౌన్స్ కేసు నమోదు చేశాడు. దీంతో కడప పోలీసులు బండ్ల గణేష్‌పై కేసులు నమోదు చేశారు. కోర్టుకు హాజరుకాకపోవడంతో కడప జిల్లా మేజిస్ట్రేట్ నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేశారు. కాగా.. గతంలో కూడా బండ్ల గణేష్‌పై తెలుగు రాష్ట్రాల్లో  పలు కేసులు నమోదైన విషయం తెలిసిందే.

సినీ ఫైనాన్షియర్‌ పొట్లూరి వరప్రసాద్‌ (పీవీపీ) కూడా కొద్దిరోజుల క్రితం ఇచ్చిన ఫిర్యాదు నేపథ్యంలో విచారించేందుకు నిన్న జూబ్లీహిల్స్‌ పోలీసులు ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. అయితే, గతంలో ఉన్న చెక్‌బౌన్స్‌ కేసులో ఆయనపై ఉన్న నాన్‌ బెయిలబుల్‌ వారెంట్‌ నేపథ్యంలో కోర్టు ఆదేశాల మేరకు  అరెస్టు చేసిన విషయం తెలిసిందే.

చక్రం తిప్పిన కీలక నేత:

బండ్ల గణేశ్‌కు బెయిల్ లభించేందుకు ఏపీ మంత్రి బొత్స సయోధ్య నడిపారని సమాచారం. కాంగ్రెస్ హయాంలో బొత్స మినిస్టర్‌గా ఉన్నప్పటి నుంచి బండ్ల గణేశ్‌తో మంచి సంబంధాలు ఉన్నాయి. అయితే ఇప్పుడు కేసు పెట్టిన పీవీపీ కూడా వైసీపీ నేత..అతడితో పాటు కడపకు చెందిన మహేశ్‌తో సన్నిహిత వర్గాల ద్వారా మాట్లాడించి..బండ్లకు  బెయిల్ వచ్చేలా బొత్స ప్రయత్నించినట్టు తెలుస్తోంది.