Unstoppable with NBK2: “ఎంట్రీ ఇస్తే కంట్రీ మొత్తం ఊగిపోతోంది”.. అదిరిపోయిన అన్ స్టాపబుల్2 టైటిల్ సాంగ్

అచ్చ తెలుగు కంటెంట్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది ఆహా. సూపర్ హిట్ సినిమాలతో పాటు అదిరిపోయే గేమ్ షోస్ తో ప్రేక్షకులను అలరిస్తోంది ఆహా.

Unstoppable with NBK2: ఎంట్రీ ఇస్తే కంట్రీ మొత్తం ఊగిపోతోంది.. అదిరిపోయిన అన్ స్టాపబుల్2 టైటిల్ సాంగ్
Unstoppable Anthem
Follow us

|

Updated on: Sep 27, 2022 | 5:30 PM

అచ్చ తెలుగు కంటెంట్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది ఆహా. సూపర్ హిట్ సినిమాలతో పాటు అదిరిపోయే గేమ్ షోస్ తో ప్రేక్షకులను అలరిస్తోంది ఆహా. ఆసక్తికర వెబ్ సిరీస్‌లు.. సరదా సంభాషణలతో సాగే టాక్ షోస్ తో దూసుకుపోతోంది ఆహా. ఇక ఆహా అందించిన అన్ స్టాపబుల్ షో గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నటసింహం నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తోన్న ఈ టాక్ షో నెంబర్ వన్ గా నిలిచింది. తనదైన స్టైల్ లో అన్ స్టాపబుల్ సీజన్ 1 ను విజయవంతంగా పూర్తి చేశారు బాలయ్య. ఈ షోకు సూపర్ స్టార్ మహేష్ బాబు, అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరోలు హాజరై సందడి చేశారు. ఇక ఇప్పుడు సీజన్ 2 కి రెడీ అవుతోంది అన్ స్టాపబుల్. త్వరలోనే అన్ స్టాపబుల్ సీజన్ 2 ను మొదలు పెట్టనున్నారు. బాలయ్య ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ చివరి దశకు వచ్చింది. ఈ షూటింగ్ కంప్లీట్ అయిన వెంటనే అన్ స్టాపబుల్ సీజన్ 2ను మొదలుపెట్టనున్నారు నటసింహం.

తాజాగా ఈ టాక్ షోకి సంబందించిన ఓ రాప్ సాంగ్ ను రిలీజ్ చేశారు. అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే 2 టైటిల్ సాంగ్ ను రిలీజ్ చేశారు ఆహా టీమ్. ఈ పాట గురించి బాలయ్య మాట్లాడుతూ.. రోల్ రైడా, మ్యూజిక్ డైరెక్టర్ మహతి స్వరసాగర్ సమకూర్చిన ఈ పాట నాకు ఎంతో బాగానచ్చింది. ఆహ అభిమానుల అందరికి నచ్చుతుందని ఆశిస్తున్నాను అని బాలయ్య అన్నారు. సీజన్ 2 లో మొదటి గెస్ట్ గా మెగాస్టార్ చిరంజీవి వస్తారని టాక్ వినిపిస్తోంది. దీనిపై క్లారిటీ లేనప్పటికీ.. మెగాస్టార్ వస్తే షో నెక్స్ట్ లెవల్ కు వెళ్తుందని అంటున్నారు. మెగా, నందమూరి ఫ్యాన్స్. చూడాలి మరి ఏంజరుగుతుందో.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

ఇవి కూడా చదవండి