Balakrishna: స్పీడ్ పెంచిన బాలకృష్ణ.. ఆ డైరెక్టర్‏తో కలిసి మరో ప్రాజెక్ట్‏కు గ్రీన్ సిగ్నల్..

నందమూరి నటసింహం బాలకృష్ణ ఇటీవల అఖండ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. డైరెక్టర్ బోయపాటి శ్రీను

Balakrishna: స్పీడ్ పెంచిన బాలకృష్ణ.. ఆ డైరెక్టర్‏తో కలిసి మరో ప్రాజెక్ట్‏కు గ్రీన్ సిగ్నల్..
Balakrishna
Follow us

|

Updated on: Jan 05, 2022 | 9:22 AM

నందమూరి నటసింహం బాలకృష్ణ ఇటీవల అఖండ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. డైరెక్టర్ బోయపాటి శ్రీను తెరకెక్కించిన ఈ మూవీ థియేటర్ల వద్ధ కాసుల వర్షం కురిపించింది. ప్రస్తుతం బాలకృష్ణ.. మాస్ డైరెక్టర్ గోపిచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో బాలయ్య సరసన శ్రుతి హాసన్ నటిస్తోంది. ఇటీవలే ఈ మూవీ పూజా కార్యక్రమాలు జరుపుకుని ఘనంగా ప్రారంభమైంది.. దీంతోపాటు.. సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో మరో సినిమా చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. తాజాగా బాలయ్య తదుపరి సినిమా గురించి ఇంట్రెస్టింగ్ వార్త ఫిల్మ్ సర్కిల్లో చక్కర్లు కొడుతుంది.

తాజా సమాచారం ప్రకారం బాలకృష్ణ మరో చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. ఇటీవల గోపిచంద్ ప్రదాన పాత్రలో సీటీమార్ సినిమాతో సక్సెస్ అందుకున్నాడు డైరెక్టర్ సంపత్ నంది. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లు అందుకుంది. ఇప్పుడు సంపత్ నంది బాలకృష్ణ కాంబోలో ఓ మూవీ రాబోతున్నట్లుగా టాక్. బాలయ్య ఇమేజ్ ను దృష్టిలో పెట్టుకుని యాక్షన్, మాస్ అంశాలతో సంపత్ నంది స్క్రీప్ట్ రెడీ చేసినట్లుగా తెలిసింది. కథాంశంలోని కొత్తదనం నచ్చడంతో బాలకృష్ణ కూడా ఈ సినిమాకు ఓకే చెప్పారని టాక్. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ కు సంబంధించిన పూర్తి వివరాలను అధికారికంగా ప్రకటించనున్నారు.

Also Read: Bellamkonda Sreenivas : స్పీడ్ పెంచిన బెల్లం కొండ హీరో.. ఛత్రపతి హిందీ రీమేక్ టాకీ పార్ట్ పూర్తి

RGV On AP Govt. సినిమా టికెట్స్ వ్యవహారం.. ఏపీ ప్రభుత్వానికి పది ప్రశ్నలను సంధించిన రామ్ గోపాల్ వర్మ ..

Perni Nani vs RGV: వర్మ ప్రశ్నలకు పేర్ని నాని కౌంటర్ ఎటాక్.. ఏ చట్టం చెప్పిందంటూ..

Anupama Parameswaran: లవ్ బ్రేకప్ గురించి హీరోయిన్ ఓపెన్ కామెంట్స్.. కానీ.. ప్రేమను గుర్తుచేసుకోనంటూ..