Balagam Movie : ఏందీ మేడమ్ ఈ గ్లామర్ మేకోవర్.. బలగం నటిని గుర్తుపట్టారా.. ?

ఒక్క సినిమా చాలు ఎంతో మంది తారల జీవితాలను మార్చేస్తుంది. రాత్రికి రాత్రే హీరోహీరోయిన్లు, దర్శకనిర్మాతలతోపాటు సహాయ నటీనటుల లైఫ్ టర్న్ చేసిన సినిమాలు అనేకం. అందులో బలగం ఒకటి. పట్టణం నుంచి పల్లె వరకు ప్రతీ నటీనటుడిని ప్రేక్షకులకు దగ్గర చేసిన మూవీ ఇది. అంతగా ప్రేక్షకుల హృదయాల్లో స్థానం సంపాదించుకుంది ఈ మూవీ.

Balagam Movie : ఏందీ మేడమ్ ఈ గ్లామర్ మేకోవర్.. బలగం నటిని గుర్తుపట్టారా.. ?
Balagam Actress

Updated on: May 31, 2026 | 7:09 AM

తెలుగు సినీ రంగంలో ఎలాంటి హడావిడి లేకుండా విడుదలై భారీ విజయాన్ని అందుకున్న చిత్రాల్లో బలగం ఒకటి. ఈ సినిమా ఎంతో మంది నటీనటుల జీవితాలను మార్చేసింది. ముఖ్యంగా తెలంగాణ పల్లె సెంటిమెంట్ తో తెరకెక్కించిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించింది. అప్పటి వరకు కమెడియన్ గా, సహయ నటుడిగా రాణించిన వేణు యెల్దండి ఈ చిత్రంతో దర్శకుడిగా వెండితెరకు పరిచయమయ్యాడు. ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులకు ఎక్కువగా కనెక్ట్ అయ్యింది. ఇక ఈ సినిమాలో నటించిన నటీనటుల గురించి చెప్పక్కర్లేదు. ఒక్కొక్కరు తమ పాత్రలకు ప్రాణం పోశారు. ప్రియదర్శి, కావ్య కళ్యాణ్ రామ్ ప్రధాన పాత్రలలో నటించిన ఈ చిత్రాన్ని దిల్‌రాజు ప్రొడక్షన్స్‌పై హర్షిత్ రెడ్డి, హన్షిత రెడ్డి నిర్మించారు. ఇక భీమ్స్ సిసిరోలియో అందించిన మ్యూజిక్.. ఈ సినిమాలోని ప్రతీ సాంగ్ సూపర్ హిట్ అయ్యాయి. ముఖ్యంగా జానపద గీతాలు ఈ సినిమాకు ప్రాణం పోశాయి.

ఎక్కువ మంది చదివినవి : ఆ హీరోను ఇప్పటికీ బావ అని పిలుస్తాను.. ప్రతి అమ్మాయి ఆయనతో రొమాన్స్ చేయాలనుకుంటుంది.. ఖుష్బూ..

ఇదిలా ఉంటే.. ఈ సినిమా ద్వారా పాపులర్ అయినవారిలో రూపాలక్ష్మీ ఒకరు. ఇందులో కొమురయ్య కూతురు లచ్చవ్వ పాత్రలో ఒదిగిపోయింది. ఆమె నటన, సహజత్వం లచ్చవ్వ పాత్రకు ప్రాణం పోశాయి. బలగం సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది. ఈ సినిమాతో ఆమె పెరు మారుమోగింది. దీంతో తెలుగులో వరుస అవకాశాలు అందుకుంటూ బిజీగా మారిపోయింది. చాలా కాలంగా సైలెంట్ అయిన ఆమె తాజాగా ఇన్ స్టాలో షేర్ చేసిన ఓ వీడియోతో మరోసారి తెరపై హాట్ టాపిక్ అయ్యింది.

ఎక్కువ మంది చదివినవి : Suriya : ఆ తెలుగు హీరో నా క్లాస్‌మేట్.. చిన్నప్పటి నుంచే మేమిద్దరం మంచి ఫ్రెండ్స్.. సూర్య కామెంట్స్..

ముఖ్యంగా ఆ వీడియోలో రూపాలక్ష్మీని చూసి ఆశ్చర్యపోతున్నారు నెటిజన్స్. బలగం సినిమాలో చీరకట్టులో ఎంతో పద్దతిగా, మన ఇంటి ఆడబిడ్డగా కనిపించిన రూపాలక్ష్మీ.. తాజాగా షేర్ చేసిన వీడియోలో మాత్రం ఊహించని విధంగా గ్లామర్ లుక్స్ లో కనిపించి ఆశ్చర్యపరిచారు. గుర్తుపట్టలేనంతగా మారిపోయిన ఆమెను చూసి ఏంటీ.. ఈమె బలగం నటి లచ్చవ్వనా అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్. ప్రస్తుతం ఆమె కారు నడుపుతూ షేర్ చేసిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

ఎక్కువ మంది చదివినవి : Tollywood : తండ్రి సూపర్ స్టార్ హీరో.. తల్లి క్రేజీ హీరోయిన్.. నెటిజన్స్ మతిపోగొట్టేస్తున్న ఈ అమ్మడు ఎవరో తెలుసా.. ?

బలగం నటి ఇన్ స్టా పోస్ట్..

ఎక్కువ మంది చదివినవి : Raghava Lawrence : రాఘవ లారెన్స్ ఫ్యామిలీని ఎప్పుడైనా చూశారా..? ఆయన భార్య ఎవరంటే.. వైరలవుతున్న ఫోటో..

Follow Us