గత కొద్ది రోజులుగా టాలీవుడ్ ఇండస్ట్రీకి..ఏపీ ప్రభుత్వానికి మధ్య తీవ్ర స్థాయిలో మాటల యుద్ధం నడుస్తున్న సంగతి తెలిసిందే. సినీ పరిశ్రమ Vs ఏపీ ప్రభుత్వం అన్నట్లుగా సినిమా టికెట్స్ రేట్స్ వివాదం నడుస్తోంది. థియేటర్స్ యాజమాన్యాలు.. ప్రొడ్యూసర్స్, సినీ ప్రముఖులు ప్రభుత్వ నిర్ణయం పై అసహనం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో టాలీవుడ్ సినీ ప్రముఖులు ఆరోపణలు చేయగా.. పొలిటికల్ లీడర్స్ రివర్స్ కామెంట్స్ చేయడంతో తీవ్ర దుమారం రేగింది. ఈ క్రమంలో సినిమా టికెట్స్ రేట్స్ తగ్గించడంపై డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ తనదైన శైలీలో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. సినిమా టికెట్స్ విషయంలో ప్రభుత్వ పెత్తనమెంటీ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక నిన్న ఇదే ఇష్యూపై వర్మ తన ట్విట్టర్ వేదికగా ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నానికి వరుస ప్రశ్నలు సందీంచారు. తన ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలంటూ పేర్ని నానికి సవాలు విసిరారు. సినిమాలతో సహా ఏదైనా ఉత్పత్తికి మార్కెట్ ధరను నిర్ణయించడంలో ప్రభుత్వ పాత్ర ఖచ్చితంగా ఏమిటి సార్ ? అంటూ వర్మ ప్రశ్నించారు.
తాజాగా వర్మ అడిగిన ప్రశ్నలకు మంత్రి పేర్ని నాని రివర్స్ కౌంటర్ ఎటాక్ చేశారు. ఆర్జీవి ట్వీట్లకు జతచేస్తూ.. వర్మ అడిగిన ఒక్కో ప్రశ్నకు తనదైన స్టైల్లో స్పందిస్తూ.. ఆర్జీవికి పలు ప్రశ్నలు సందించాడు. 1. “గౌరవనీయులైన @RGVzoomin గారూ… మీ ట్వీట్లు చూశాను. నాకు ఉన్న సందేహాన్ని తెలియపరుస్తున్నాను. రూ.100 టికెట్ ను రూ.1000 కి, 2000కి అమ్ముకోవచ్చని ఏ బేసిక్ ఎకనమిక్స్ చెప్పాయ్? ఏ చట్టం చెప్పింది? దీన్ని ఏ మార్కెట్ మెకానిజం అంటారు? డిమాండ్ & సప్లై అంటారా? లేక బ్లాక్ మార్కెటింగ్ అంటారా?..
2. ఉప్పూ పప్పూ లాంటి నిత్యావసర వస్తువుల ధరల్ని మాత్రమే ప్రభుత్వం నియంత్రించవచ్చుగానీ, సినిమా టికెట్ల ధరల్ని ప్రభుత్వం ఎలా నిర్ణయిస్తుందని అడిగారు. థియేటర్లు అనేవి ప్రజా కోణంలో వినోద సేవలు పొందే ప్రాంగణాలు.
3. సామాన్యుడి మోజుని,అభిమానాన్ని లూటీ చేసే పరిస్థితి లేకుండా చూసేందుకు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు 66 ఏళ్ళుగా చట్టాలకు లోబడే సినిమా టికెట్ ధరను నిర్ణయిస్తున్నాయి.
4. బలవంతంగా ధరలు తగ్గిస్తే మోటివేషన్ పోతుందన్నది ఎకనామిక్స్‌లో ప్రాథమిక సూత్రం అని చెప్పారు. ఎవరికి వర్మగారూ? కొనేవారికా? అమ్మేవారికా? మీరు ఎంతవరకు ప్రొడ్యూసర్స్ శ్రేయస్సు గురించే మాట్లాడుతూ కన్స్యూమర్ యాంగిల్‌ను గాలికి వదిలారు. కాస్త ప్రేక్షకుల గురించి కూడా ఆలోచించండి వర్మ గారూ.
5. సినిమాను అత్యవసర సర్వీసుగా ప్రభుత్వం భావిస్తుంటే… మెడికల్, ఎడ్యుకేషన్ మాదిరిగానే సబ్సిడీని ప్రభుత్వం భరించాలని అడిగారు. సినిమాను మేం నిత్యావసరంగా గానీ, అత్యవసరంగా గానీ భావించటం లేదు @RGVzoomin గారూ.
6. హీరోలకు నిర్మాతలు ఇచ్చే రెమ్యూనరేషన్‌కు ఒక ఫార్ములా చెప్పారు. మీరు ఏ హీరోకు ఎంత ఇస్తారు? ఎంత ఖర్చుతో సినిమా తీస్తారు అన్నది పరిగణనలోకి తీసుకుని ఏనాడూ థియేటర్లలో టికెట్ల ధరను ఏ రాష్ట్ర ప్రభుత్వమూ నిర్ణయించదు @RGVzoomin గారూ.
7. థియేటర్లో సినిమా టికెట్ల ధరల్ని ప్రేక్షకులకు కల్పించే సౌకర్యాల ఆధారంగా నిర్ణయించాలని మాత్రమే 1970 సినిమాటోగ్రఫీ చట్టం ద్వారా వచ్చిన నిబంధనలు చెపుతున్నాయి.
8. ఒక వస్తువుకు సంబంధించిన మార్కెట్ ధర నిర్ణయంలో అసలు ప్రభుత్వానికి ఉన్న పాత్ర ఏమిటో సమాధానమివ్వండని అడిగారు. సినిమా ఒక వస్తువు కాదు.అది వినోద సేవ మాత్రమే.ప్రజల్ని దృష్టిలో ఉంచుకుని మేం చేస్తున్నది థియేటర్లలో టికెట్ ధరల నియంత్రణ మాత్రమే తప్ప,సినిమా నిర్మాణ నియంత్రణ ముమ్మాటికీ కాదు
9. మీకు కింది నుంచి మద్దతు ఇవ్వటానికి ప్రజలు మాకు అధికారాన్ని ఇచ్చారని,మీ నెత్తిన ఎక్కి తొక్కటానికి కాదన్నారు.సినిమా టికెట్‌ను ఎంతకైనా అమ్ముకోనిస్తే పరిశ్రమకు కింది నుంచి బలాన్ని ఇచ్చినట్టు.సామాన్యుడిని దోచుకోకుండా ఆపితే మీ నెత్తిన ఎక్కి తొక్కినట్టు మీరు ప్రవచించటం సబబేనా వర్మ గారూ?
గౌరవనీయులైన @RGVzoomin గారూ…
మీ ట్వీట్లు చూశాను. నాకు ఉన్న సందేహాన్ని తెలియపరుస్తున్నాను. రూ.100 టికెట్ ను రూ.1000 కి, 2000కి అమ్ముకోవచ్చని ఏ బేసిక్ ఎకనమిక్స్ చెప్పాయ్? ఏ చట్టం చెప్పింది? దీన్ని ఏ మార్కెట్ మెకానిజం అంటారు? డిమాండ్ & సప్లై అంటారా? లేక బ్లాక్ మార్కెటింగ్ అంటారా?— Perni Nani (@perni_nani) January 5, 2022
ఉప్పూ పప్పూ లాంటి నిత్యావసర వస్తువుల ధరల్ని మాత్రమే ప్రభుత్వం నియంత్రించవచ్చుగానీ, సినిమా టికెట్ల ధరల్ని ప్రభుత్వం ఎలా నిర్ణయిస్తుందని అడిగారు. థియేటర్లు అనేవి ప్రజా కోణంలో వినోద సేవలు పొందే ప్రాంగణాలు. https://t.co/gUtUwGc3jy
— Perni Nani (@perni_nani) January 5, 2022
సామాన్యుడి మోజుని,అభిమానాన్ని లూటీ చేసే పరిస్థితి లేకుండా చూసేందుకు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు 66 ఏళ్ళుగా చట్టాలకు లోబడే సినిమా టికెట్ ధరను నిర్ణయిస్తున్నాయి.
— Perni Nani (@perni_nani) January 5, 2022
బలవంతంగా ధరలు తగ్గిస్తే మోటివేషన్ పోతుందన్నది ఎకనామిక్స్‌లో ప్రాథమిక సూత్రం అని చెప్పారు. ఎవరికి వర్మగారూ? కొనేవారికా? అమ్మేవారికా? మీరు ఎంతవరకు ప్రొడ్యూసర్స్ శ్రేయస్సు గురించే మాట్లాడుతూ కన్స్యూమర్ యాంగిల్‌ను గాలికి వదిలారు. కాస్త ప్రేక్షకుల గురించి కూడా ఆలోచించండి వర్మ గారూ. https://t.co/hbnMQsetDi
— Perni Nani (@perni_nani) January 5, 2022
సినిమాను అత్యవసర సర్వీసుగా ప్రభుత్వం భావిస్తుంటే… మెడికల్, ఎడ్యుకేషన్ మాదిరిగానే సబ్సిడీని ప్రభుత్వం భరించాలని అడిగారు. సినిమాను మేం నిత్యావసరంగా గానీ, అత్యవసరంగా గానీ భావించటం లేదు @RGVzoomin గారూ. https://t.co/UWpcePJ2R2
— Perni Nani (@perni_nani) January 5, 2022
హీరోలకు నిర్మాతలు ఇచ్చే రెమ్యూనరేషన్‌కు ఒక ఫార్ములా చెప్పారు. మీరు ఏ హీరోకు ఎంత ఇస్తారు? ఎంత ఖర్చుతో సినిమా తీస్తారు అన్నది పరిగణనలోకి తీసుకుని ఏనాడూ థియేటర్లలో టికెట్ల ధరను ఏ రాష్ట్ర ప్రభుత్వమూ నిర్ణయించదు @RGVzoomin గారూ. https://t.co/hV7eeEZLji
— Perni Nani (@perni_nani) January 5, 2022
థియేటర్లో సినిమా టికెట్ల ధరల్ని ప్రేక్షకులకు కల్పించే సౌకర్యాల ఆధారంగా నిర్ణయించాలని మాత్రమే 1970 సినిమాటోగ్రఫీ చట్టం ద్వారా వచ్చిన నిబంధనలు చెపుతున్నాయి.
— Perni Nani (@perni_nani) January 5, 2022
ఒక వస్తువుకు సంబంధించిన మార్కెట్ ధర నిర్ణయంలో అసలు ప్రభుత్వానికి ఉన్న పాత్ర ఏమిటో సమాధానమివ్వండని అడిగారు. సినిమా ఒక వస్తువు కాదు.అది వినోద సేవ మాత్రమే.ప్రజల్ని దృష్టిలో ఉంచుకుని మేం చేస్తున్నది థియేటర్లలో టికెట్ ధరల నియంత్రణ మాత్రమే తప్ప,సినిమా నిర్మాణ నియంత్రణ ముమ్మాటికీ కాదు https://t.co/eGEbF3LaLN
— Perni Nani (@perni_nani) January 5, 2022
మీకు కింది నుంచి మద్దతు ఇవ్వటానికి ప్రజలు మాకు అధికారాన్ని ఇచ్చారని,మీ నెత్తిన ఎక్కి తొక్కటానికి కాదన్నారు.సినిమా టికెట్‌ను ఎంతకైనా అమ్ముకోనిస్తే పరిశ్రమకు కింది నుంచి బలాన్ని ఇచ్చినట్టు.సామాన్యుడిని దోచుకోకుండా ఆపితే మీ నెత్తిన ఎక్కి తొక్కినట్టు మీరు ప్రవచించటం సబబేనా వర్మ గారూ? https://t.co/pwsOQsY9uW
— Perni Nani (@perni_nani) January 5, 2022
Also Read: Bellamkonda Sreenivas : స్పీడ్ పెంచిన బెల్లం కొండ హీరో.. ఛత్రపతి హిందీ రీమేక్ టాకీ పార్ట్ పూర్తి