
తెలుగమ్మాయి ఆనంది ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం ‘గరివిడి లక్ష్మీ’. ఉత్తరాంధ్ర జానపద కళారూపమైన బుర్రకథకు ప్రాణం పోసిన దిగ్గజ కళాకారిణి రెడ్డి విజయలక్ష్మి (గరివిడి లక్ష్మి) జీవిత చరిత్ర ఆధారంగా ఈ సినిమాను తెరకెకకించారు. పీపుల్స్ మీడియా పతాకంపై టి.జి. విశ్వప్రసాద్, ఆయన కుమార్తె కృతి ప్రసాద్ నిర్మించిన ఈ సినిమాకు గౌరి నాయుడు జమ్ము దర్శకత్వం వహించారు. గరివిడి లక్ష్మీగా ఆనంది నటిస్తుండగా, సీనియర్ హీరోయిన్ రాశి మరో కీలక పాత్ర పోషించారు. వీరితో పాటు నరేశ్, రాగ్ మయూర్, శరణ్య ప్రదీప్, అంకిత్ కొయ్య, మీసాల లక్ష్మణ్, కంచరపాలెం కిషోర్, కుశాలిని తదితరులు ఈ మూవీలో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పాటలు, ట్రైలర్ సోషల్ మీడియాలో హోరెత్తిపోతున్నాయి. అన్ని హంగులు పూర్తి చేసుకున్న ఈ సినిమా దసరా కానుకగా అక్టోబర్ 17న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఏపీ మంత్రి గరివిడి లక్ష్మి సినిమాపై ఆసక్తికర ట్వీట్ చేశారు. సాధారణ ప్రేక్షకుల్లాగే తాను కూడా ఈ సినిమా రిలీజ్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు పేర్కొన్నారు.
‘సోషల్ మీడియాలో హోరెత్తిపోతున్న గరివిడి లక్ష్మి సినిమా పాటలు, టీజర్ నాలో ఆసక్తి రేపాయి. ఎవరీ గరివిడి లక్ష్మి, ఏంటా కథ అని ఆరా తీశాను. ఊరు పేరునే ఇంటి పేరుగా, బుర్రకథనే జీవితంగా బతికి, కళని బతికించిన రెడ్డి విజయలక్ష్మి యథార్థ గాథ ఆధారంగా గరివిడి లక్ష్మి సినిమా తెరకెక్కుతోందని తెలిసింది. చదువుకోకపోయినా సాంప్రదాయ బుర్రకథ శైలికి ఉత్తరాంధ్ర జానపదాలు, పల్లెపదాలు జోడించి బుర్రకథ కళకే వన్నెతెచ్చిన గరివిడి లక్ష్మి సినిమా విడుదల కోసం ప్రేక్షకుల మాదిరిగానే నేనూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. ఈ సినిమా కోసం పనిచేసిన కళాకారులందరికీ ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను’ అని ట్వీట్ లో రాసుకొచ్చారు లోకేశ్.
సోషల్ మీడియాలో హోరెత్తిపోతున్న గరివిడి లక్ష్మి సినిమా పాటలు, టీజర్ నాలో ఆసక్తి రేపాయి. ఎవరీ గరివిడి లక్ష్మి, ఏంటా కథ అని ఆరా తీశాను. ఊరు పేరునే ఇంటి పేరుగా, బుర్రకథనే జీవితంగా బతికి, కళని బతికించిన రెడ్డి విజయలక్ష్మి యథార్థ గాథ ఆధారంగా గరివిడి లక్ష్మి సినిమా తెరకెక్కుతోందని తెలిసింది. చదువుకోకపోయినా సాంప్రదాయ బుర్రకథ శైలికి ఉత్తరాంధ్ర జానపదాలు, పల్లెపదాలు జోడించి బుర్రకథ కళకే వన్నెతెచ్చిన గరివిడి లక్ష్మి సినిమా విడుదల కోసం ప్రేక్షకుల మాదిరిగానే నేనూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. ఈ సినిమా కోసం పనిచేసిన కళాకారులందరికీ ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.
@anandhiactress @smayurk
https://t.co/4NMPO0sESM— Lokesh Nara (@naralokesh) October 10, 2026
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.