
NTR Chandra Babu: కరోనా మహమ్మారి వారు వీరూ అనే తేడా లేకుండా అందరినీ చుట్టేస్తోంది. సామాన్యులను నుంచి సెలబ్రిటీల వరకు అందరినీ ముప్పు తిప్పలు పెడుతోంది. అత్యంత లగ్జరీ జీవితాన్ని అనుభవిస్తూ, బయటకు వస్తే ఎన్నో జాగ్రత్తలు తీసుకునే వారిని కూడా కరోనా ముప్పుతిప్పలు పెడుతోంది.
ఇప్పటికే చాలామంది సెలబ్రిటీలు కరోనా బారిన పడ్డారు. తాజాగా వీరి వరుసలో ప్రముఖ నటుడు జూనియర్ ఎన్టీఆర్ కూడా వచ్చి చేరారు. తాజాగా సోమవారం తారక్ కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని తానే స్వయంగా తెలయజేస్తూ ఇటీవలి కాలంలో తనతో ఉన్నవారు పరీక్ష చేయించుకోవాలని తెలిపారు. ఇక తారక్ కరోనా బారిన పడిన విషయం తెలియడంతో ఆయన అభిమానులతో పాటు పలువురు సినీ ప్రముఖులు ఆయన ఆరోగ్యాన్నిఆకాంక్షిస్తూ సోషల్ మీడియా వేదికగా పోస్టులు చేస్తున్నారు. ఇందులో భాగంగానే తాజాగా మాజీ ముఖ్యమంత్రి.. తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు జూనియర్ ఆరోగ్యాన్నికోరుతూ ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన ట్వీట్ చేస్తూ.. తారక్ కరోనా నుంచి త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను. జాగ్రత్తగా ఉండు అంటూ ట్వీట్ చేశారు. ఇదిలా ఉంటే తారక్‌కు కరోనా సోకడంతో ఆయన కొత్త సినిమా ఆర్ఆర్ఆర్పై ఆ ప్రభావం పడింది. రామ్‌చరణ్, జూనియర్ ఎన్టీఆర్‌ల మధ్య చిత్రీకరించాల్సిన సన్నివేశాలు వాయిదా పడ్డాయి. దీంతో ఇది సినిమా విడుదలపై కూడా ప్రభావం చూపుతుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
Home Isolation: హోం ఐసోలేషన్‌లో ఉన్న కరోనా బాధితులు.. ఏం చేయాలి.? ఏం చేయకూడదు.?