Pawan Kalyan- Vijay: హీరో విజయ్ పొలిటికల్ ఎంట్రీ.. పవన్ కల్యాణ్ రియాక్షన్ ఏంటంటే?

|

Oct 28, 2024 | 5:06 PM

2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా బరిలోకి దిగాడు విజయ్. ఆదివారం (అక్టోబర్ 28) జరిగిన మొదటి బహిరంగ సభలోనే తన ఉద్దేశాన్ని సూటిగా చెప్పేశాడు విజయ్. తాము ఏ పార్టీకీ బీ టీమ్ సీ టీమ్ కాదని ప్రత్యర్థుల విమర్శలకు కౌంటర్లు ఇచ్చాడు.

Pawan Kalyan- Vijay: హీరో విజయ్ పొలిటికల్ ఎంట్రీ.. పవన్ కల్యాణ్ రియాక్షన్ ఏంటంటే?
Vijay, Pawan Kalyan
Follow us on

తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ తన రాజకీయ ప్రస్థానానికి శంఖారావం పూరించారు. ఇప్పటికే తమిళగ వెట్రి కజగం పేరుతో రాజకీయ పార్టీని స్థాపించారాయన. 2026 తమిళనాడు ఎన్నికల్లో పూర్తి స్థాయిలో పోటీ చేయడమే లక్ష్యంగా పావులు కదుపుతున్నాడు విజయ్. ఇందులో భాగంగానే ఆదివారం (అక్టోబర్ 28) విల్లుపురంలో మొదటి బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభకు ఏకంగా 5 లక్షల మందికి పైగా వచ్చారని సమాచారం. ఇక తన స్పీచ్‌తోనూ అందరినీ ఆకట్టుకున్నాడు విజయ్. మొత్తానికి విజయ్ టీవీకే పార్టీతో తమిళనాడులో రాజకీయ ప్రకంపనలు మొదలయ్యాయని చెప్పవచ్చు. ఈ క్రమంలోనే విజయ్ కు పలువురు సినీ సెలబ్రిటీలు అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతున్నారు. తాజాగా ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ విజయ్ పొలిటికల్ ఎంట్రీపై స్పందించారు. సోషల్ మీడియా వేదికగా టీవీకే అధినేతకు అభినందనలు తెలిపారు. ‘సాధువులు, సిద్ధుల భూమి అయిన తమిళనాడులో రాజకీయ ప్రస్థానం ప్రారంభించినందుకు నటుడు విజయ్ కి నా హృదయపూర్వక అభినందనలు’ అని ట్వీట్ చేశారు పవన్ కల్యాణ్. ప్రస్తుతం ఈపోస్ట్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.

కాగా టాలీవుడ్ లో పవన్ కల్యాణ్ కు ఎంత క్రేజ్ ఉందో కోలీవుడ్ లో విజయ్ కూడా అంతే క్రేజ్ ఉంది. వీరిద్దరి ఒకరు సినిమాలు ఒకరు రీమేక్ చేసుకుని సూపర్ హిట్స్ సొంతం చేసుకున్నారు. ఇక ఇద్దరూ కూడా స్టార్ హీరోలుగా కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడే రాజకీయాల్లోకి అడుగు పెట్టారు. అలా జన సేన పార్టీని ప్రారంభించి రాజకీయాల్లో సక్సెస్ అయ్యారు పవన్ కల్యాన్‌. మరి విజయ్ కూడా పాలిటిక్స్ లో సక్సెస్ అవుతాడో లేదో చూడాలి.

ఇవి కూడా చదవండి

పవన్ కల్యాణ్ ట్వీట్..

విజయ్ సభకు హాజరైన అశేష జన సందోహం..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.