Kathanar Movie: మలయాళంలోకి అనుష్క ఎంట్రీ.. హాలీవుడ్ రేంజ్‌లో ‘కథనార్’ ట్రైలర్.. రిలీజ్ ఎప్పుడంటే?

అనుష్క శెట్టి తొలిసారిగా ఒక మలయాళ చిత్రంలో నటిస్తోంది. 'కథనార్' పేరుతో తెరకెక్కిన ఈ ఫాంటసీ మూవీ ట్రైలర్ మంగళవారం (మార్చి 31) విడుదలైంది. సుమారు 2 నిమిషాల 58 సెకన్ల నిడివి గల ఈ ట్రైలర్ ప్రేక్షకులను ఒక విభిన్న ప్రపంచంలోకి తీసుకువెళుతోంది.

Kathanar Movie: మలయాళంలోకి అనుష్క ఎంట్రీ.. హాలీవుడ్ రేంజ్‌లో కథనార్ ట్రైలర్.. రిలీజ్ ఎప్పుడంటే?
Kathanar Movie Trailer

Updated on: Apr 01, 2026 | 6:10 AM

గోకులం మూవీస్ బ్యానర్ మీద గోకులం గోపాలన్ నిర్మాతగా రొజిన్ థామస్ తెరకెక్కించిన చిత్రం ‘కథనార్’. ఈ సినిమాలో జయసూర్య, అనుష్క శెట్టి, ప్రభుదేవా, సనూప్ సాన్ వంటి వారు కీలక పాత్రల్ని పోషించారు. ఈ మూవీకి సంబంధించిన ట్రైలర్‌ను విడుదల చేశారు. ‘విజ్ఞానం యొక్క రూపం మూలం ఎలా ఉన్నా కూడా.. కాంతూర్ శాలయలో దాన్ని ఆహ్వానిస్తారు.. ఇంద్రజాలాన్ని నేను నమ్మను.. అవగాహనతో రహస్య మార్గాలలో వాళ్లు దాన్ని పరిశోధిస్తున్నారు.. ఎవరి ఊహకి అందని.. అందరూ ఆశ్చర్యంతో చూసే ఒక మాయా జాలం.. మన ఆత్మతో కలిసి మన జ్ఞాపకాలతో ఐక్యం కాబోయే ఒక సంఘటన.. చేర మహారాజుకి కుంచమున్ తరుపున శుభాకాంక్షలు’.. ‘చూసినది విన్నది ఏదీ రాదు.. వచ్చేది ఒక్కటే.. ఆపత్కాలంలో వచ్చే మహా మనిషి అగ్ని ఒక్కటే’.. ‘కరం కలిస్తే ఆప్యాయిత.. కరం వెడిస్తే నాశనమే బలం’.. ‘ఒక శరీరాన్ని అదుపు చేసే ఎక్కువ శక్తిని మీరు నియంత్రించగలిగారు.. ఎలాగా?’.. ‘మేం చెప్పేది నమ్మండి. వేనాడు ఆపదలో ఉంది’.. ‘మాయ.. ప్రపంచమే మాయ’ అంటూ సాగిన డైలాగ్స్‌తో ట్రైలర్ అద్భుతంగా ఉంది.

ఇక ఈ ట్రైలర్‌లో జయసూర్య, అనుష్క శెట్టి, ప్రభుదేవా, సనూప్ సాన్, శాండీ, దేవిక, నితీష్ భరద్వాజ్, వినీత్, హరీష్ ఉత్తమన్, శ్రీకాంత్ మురళి, కులప్రీత్ యాదవ్‌లను చూపించిన తీరు, ఒక్కో పాత్ర, వారి లుక్‌ను రివీల్ చేసిన తీరు అద్భుతంగా ఉంది. ఇక ఇందులోని యాక్షన్ సీక్వెన్స్, విజువల్స్, వీఎఫ్ఎక్స్ వర్క్ అద్భుతంగా ఉందనిపిస్తోంది. ఈ ట్రైలర్‌ను చూస్తుంటే ఇండియన్ సినీ లవర్స్‌కి నెవ్వర్ బిఫోర్ అనిపించేలా సినిమాటిక్ ఎక్స్‌పీరియెన్స్‌ను అందించబోతోన్నట్టుగా కనిపిస్తోంది. గోకులం గోపాలన్ ‘శ్రీ గోకులం మూవీస్’ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రం మలయాళంతో పాటు కన్నడ, తెలుగు, తమిళ, హిందీ భాషల్లో విడుదల కానుంది. తన మాయా శక్తులతో సామాన్య ప్రజల కష్టాలను తీర్చే 9వ శతాబ్దపు కేరళ పురాణ పురుషుడైన కథానార్ జానపద గాథ ఆధారంగా ఈ చిత్రం రూపొందింది. అనుష్క శెట్టికి ఇది తొలి మలయాళ చిత్రం.ఈ చిత్రానికి ఆర్ రామానంద్, రోజిన్ థామస్ రైటర్స్‌గా పని చేశారు. ఈ సినిమాకి నీల్ డి కున్హా కెమెరామెన్‌గా, రాహుల్ సుబ్రహ్మణ్యన్ మ్యూజిక్ డైరెక్టర్‌గా, కృష్ణమూర్తి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన ఇతర అప్డేట్‌లను ప్రకటించనున్నారు.

ఇవి కూడా చదవండి

కథనార్ సినిమా తెలుగు ట్రైలర్..

Follow Us