Bahishkarana: అదరగొట్టిన అంజలి.. ఆకట్టుకుంటున్న బహిష్కరణ టీజర్

|

Jul 07, 2024 | 2:43 PM

తాజాగా ఆమె ప్రధాన పాత్రలో జీ 5, పిక్సల్ పిక్చర్స్ ఇండియా బ్యానర్స్‌పై రూపొందుతోన్న వెబ్ సిరీస్ ‘బహిష్కరణ’. ముఖేష్ ప్రజాపతి ఈ సిరీస్‌ను తెరకెక్కిస్తున్నారు. విలేజ్ రివేంజ్ డ్రామా జోనర్‌లో రూపొందుతోన్న ఈ సిరీస్‌లో 6 ఎపిసోడ్స్ ఉంటాయి. ఈ వెబ్ సిరీస్ జూలై 19 నుంచి జీ5లో స్ట్రీమింగ్ కాబోతోంది. తాజాగా ఈ సిరీస్ టీజ‌ర్‌ను విడుద‌ల చేశారు. 

Bahishkarana: అదరగొట్టిన అంజలి.. ఆకట్టుకుంటున్న బహిష్కరణ టీజర్
Bahishkarana
Follow us on

యాబైకి పైగా చిత్రాల్లో హీరోయిన్‌గా, విలక్షణ పాత్రల్లో మెప్పించిన నటి అంజలి. తాజాగా ఆమె ప్రధాన పాత్రలో జీ 5, పిక్సల్ పిక్చర్స్ ఇండియా బ్యానర్స్‌పై రూపొందుతోన్న వెబ్ సిరీస్ ‘బహిష్కరణ’. ముఖేష్ ప్రజాపతి ఈ సిరీస్‌ను తెరకెక్కిస్తున్నారు. విలేజ్ రివేంజ్ డ్రామా జోనర్‌లో రూపొందుతోన్న ఈ సిరీస్‌లో 6 ఎపిసోడ్స్ ఉంటాయి. ఈ వెబ్ సిరీస్ జూలై 19 నుంచి జీ5లో స్ట్రీమింగ్ కాబోతోంది. తాజాగా ఈ సిరీస్ టీజ‌ర్‌ను విడుద‌ల చేశారు. టీజ‌ర్‌ను గ‌మ‌నిస్తే.. రేడియోలో చ‌క్క‌టి పాట వ‌స్తుంటుంది.. ప్ర‌శాంత‌మైన ప‌ల్లెటూరు.. బ‌స్సులో కూర్చున్న అమ్మాయి ఆ స్వ‌చ్చ‌మైన గాలిని ఆస్వాదిస్తుంటుంది.. ఈ సన్నివేశంతో ప్రారంభ‌మైన టీజ‌ర్‌కు ఈ ప్ర‌పంచం లొంగిపోయేది రెండిటికే .. ఒక‌టి సొమ్ముకి, ఇంకొక‌టి సోకు అనే డైలాగ్ ఓ అమ్మాయి ఈ ప్ర‌పంచాన్ని అర్థం చేసుకున్న తీరుని చెప్పే ప్ర‌య‌త్నం చేస్తుంది. అంజ‌లి మ‌రో విల‌క్ష‌ణ‌మైన పాత్ర‌లో మెప్పించే ప్ర‌య‌త్నం చేసింద‌ని టీజ‌ర్‌లో ఆమె న‌టించిన స‌న్నివేశాల‌ను చూస్తుంటే అర్థ‌మ‌వుతుంది.

ఓ వైపు ప్రేమ కురిపిస్తూనే మ‌రో వైపు ఆగ్ర‌హావేశంతో ఊగిపోయే ఆమె పాత్ర‌ను చూస్తుంటే ఆమె పోషించిన పాత్ర‌లోని భావోద్వేగాలు ఎంత లోతుల్లో ఉన్నాయో అర్థ‌మ‌వుతుంది. ప్ర‌శాంతంగా ఉండే ఆ ప‌ల్లెటూరుకి అమ్మాయి ఎందుకు వ‌చ్చింది.. ఆమెకు అక్క‌డ ఎదురైన ప‌రిస్థితులేంటి? ఆమె ఎవ‌రిపై ప్ర‌తీకారం తీర్చుకోవాల‌నుకుంది.. ఎందుకు? అనే విష‌యాలు తెలియాలంటే జూలై 19న జీ 5లో స్ట్రీమింగ్ కానున్న‌ ‘బహిష్కరణ’ సిరీస్ చూడాల్సిందే. ఈ సిరీస్‌కు ప్రసన్నకుమార్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా సిద్ధార్థ్ సదాశివుని సంగీతాన్ని సమకూరుస్తున్నారు. రవితేజ గిరిజాల ఎడిటర్‌గా బాధ్యతలను నిర్వహిస్తున్నారు.

భార‌త‌దేశంలో అతి పెద్ద ఓటీటీ మాధ్య‌మం జీ5. ప‌లు భాష‌ల్లో వైవిధ్య‌మైన సినిమాలు, సిరీస్‌ల‌తో ప్రేక్ష‌కుల‌కు అప‌రిమిత‌మైన వినోదాన్ని ఇది అందిస్తోంది. ఇదే క్ర‌మంలో ‘బహిష్కరణ’ వంటి డిఫరెంట్ కాన్సెప్ట్‌తో ఆడియెన్స్‌ను త్వరలోనే అలరించనుంది.

జీ5  3,500 సినిమాల లైబ్ర‌రీ ఉన్న ప్లాట్‌ఫార్మ్ . 1,750 టీవీ షోలు, 700 ఒరిజిన‌ల్స్, 5 ల‌క్ష‌ల‌కు పైగా ఆన్ డిమాండ్ కంటెంట్ ఉంది. 12 భాష‌ల్లో (హిందీ, ఇంగ్లిష్‌, బెంగాలీ, మ‌ల‌యాళం, తెలుగు, త‌మిళ్‌, మ‌రాఠీ, ఒరియా, భోజ్‌పురి, గుజ‌రాతీ, పంజాబీ)లో అందుబాటులో ఉంది. ఒరిజిన‌ల్స్, ఇంట‌ర్నేష‌న‌ల్ మూవీస్‌, టీవీ షోస్‌, మ్యూజిక్‌, కిడ్స్ షోస్‌, ఎడ్‌టెక్‌, సినీ ప్లేస్‌, న్యూస్‌, లైవ్ టీవీ, హెల్త్, లైఫ్‌స్టైల్ విభాగాల్లో ప్రేక్ష‌కుల‌ను రంజింప‌జేస్తోంది. జీ5 12 భాష‌ల్లో అత్య‌ద్భుత‌మైన కంటెంట్‌ని ప్రేక్ష‌కుల‌కు అందిస్తుంది

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.