
యాంకరింగ్‌పై పట్టు పెంచుకుంటున్న దీపిక పిల్లి.. అందం విషయంలో మాత్రం కుర్రకారుకు నిద్ర పట్టుకుండా చేస్తోంది. ఇప్పటికే ఈ అమ్మడి పేరు మీద సోషల్ మీడియాలో బోలెడు ఫ్యాన్ పేజీలు ఓపెన్ అయ్యాయి. ఆ పేజీలకు లక్షల్లో ఫాలోవర్స్ ఉన్నారు.

ప్రస్తుతం ఢీ షోలో ఒక టీమ్‌కు లీడర్‌గా వ్యవహరిస్తోంది. దీపిక వీడియోస్, కామెడీ వ్లోగ్స్ కూడా చేస్తోంది. అవి అప్‌లోడ్ చేసి రోజు కూడా కాకుండానే మిలియన్ వ్యూస్ దక్కించుకుంటాయంటే ఆమె క్రేజ్ ఏ రేంజ్ లో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.

ఇక టిక్ టాక్, ఇన్ స్టా రీల్స్ విషయంలో ఈ అమ్మాయి నెక్ట్స్ లెవల్ అని చెప్పాలి. అదిరిపోయే డ్యాన్స్ మూవ్స్‌తో ఆకట్టుకుంటుంది. చిపిలి చిలిపి చేష్టలతో కుర్రాళ్లను ఉడికిస్తుంది. ఈ అమ్మాయి హీరోయిన్ మెటిరియల్ అని చెబుతుంటారు ఆమెను పిచ్చిగా ఫాలో అయ్యేవాళ్లు. కరెక్ట్‌గా ప్లాన్ చేసుకుంటే ఈ బ్యూటీకి ఆ ఛాన్స్ ఉందనే చెప్పాలి.

అందాలతో కుర్రాళ్లను పిచ్చెక్కిస్తున్న ఈ పిల్లది హైదరాబాదే. ఈమె రేవంత్ చౌదరి అనే అబ్బాయితో కలిసి ఎక్కువ వీడియోలు చేస్తుంటుంది.

ఈ ఫోటోలు చూశాక ఇప్పటివరకు ఆమె గురించి తెలియనివారు అవాక్కవుతారు. అయినా సోషల్ మీడియా యూజ్ చేసేవాళ్లకు దీపికా పిల్లి తెలియదంటే షాకవ్వాల్సిందే.