Anasuya Bharadwaj: పుష్ప2 కోసం రంగంలోకి దిగిన అనసూయ.. వైరల్ అవుతోన్న ఫోటో

|

Jun 27, 2023 | 1:47 PM

తనదైన మాటకారీ తనంతో ప్రేక్షకులను మెస్మరైజ్ చేసే అనసూయ.. సినిమాల్లోనూ తన నటనతో అబ్బురపరుస్తుంది. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన రంగస్థలం ఈ అమ్మడు జాతకాన్ని మార్చేసిందనే చెప్పాలి. ఈ సినిమాలో రంగమ్మత్తగా అనసూయ చేసిన పాత్ర ప్రేక్షకులకు ఎప్పటికి గుర్తుండిపోతుంది.

Anasuya Bharadwaj: పుష్ప2 కోసం రంగంలోకి దిగిన అనసూయ.. వైరల్ అవుతోన్న ఫోటో
Anasuya
Follow us on

యాంకరింగ్ తో పాటు సినిమాలతోనూ ఫుల్ బిజీగా గడిపేస్తోంది అనసూయ. ఆమె అందం అభినయం, చలాకీతనం పేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుంటాయి. తనదైన మాటకారీ తనంతో ప్రేక్షకులను మెస్మరైజ్ చేసే అనసూయ.. సినిమాల్లోనూ తన నటనతో అబ్బురపరుస్తుంది. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన రంగస్థలం ఈ అమ్మడు జాతకాన్ని మార్చేసిందనే చెప్పాలి. ఈ సినిమాలో రంగమ్మత్తగా అనసూయ చేసిన పాత్ర ప్రేక్షకులకు ఎప్పటికి గుర్తుండిపోతుంది. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవడంతో అనసూయకు అవకాశాలు క్యూ కట్టాయి.   బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో అలరిస్తోంది ఈ ముద్దుగుమ్మ. ఇక సుకుమార్ అల్లు అర్జున్ కాంబినేషన్ లో వచ్చిన పుష్ప సినిమాలో కీలకపాత్రలో నటించిన విషయం తెలిసిందే. పుష్ప సినిమాలో దాక్షాయణి గా ఆమె నటించింది.

పుష్ప సినిమాలో సునీల్ భార్యగా నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించి మెప్పించింది. ఈ సినిమాలో ఆమె పాత్ర ఉండేది కొద్దిసేపే అయినా తన నటనతో ఆకట్టుకుంది అనసూయ. ఇక ఇప్పుడు పుష్ప 2 కోసం రంగంలోకి దిగుతోంది. అనసూయ పాత్ర పుష్ప 2 లో మరింత కీలకంగా ఉంటుందని తెలుస్తోంది.

పుష్ప 2 కోసం దర్శకుడు సుకుమార్ కథను మరింత పవర్ఫుల్ గా మార్చారని తెలుస్తోంది. మొదటి భాగం కంటే ఎక్కువ యాక్షన్ సీన్స్, ట్విస్ట్ లతో పార్ట్ 2 అదిరిపోతుంది అంటున్నారు. ఇక ఈ మూవీ షూటింగ్ ఇటీవలే మొదలైంది. ఈ మూవీలో తన పాత్ర కోసం అనసూయ మేకప్ వేసుకుంటున్న ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇప్పుడు ఈ పోస్ట్ తెగ వైరల్ అవుతోంది.