Baby Movie: సంక్రాంతి స్పెషల్ అప్డేట్ ఇచ్చిన ఆనంద్ దేవరకొండ.. బేబీ మూవీ నుంచి స్పెషల్ పోస్టర్ రిలీజ్..

రౌడీ హీరో విజయ్ దేవరకొండ తమ్ముడిగా దొరసాని సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు ఆనంద్ దేవరకొండ. మొదటి సినిమాతోనే

Baby Movie: సంక్రాంతి స్పెషల్ అప్డేట్ ఇచ్చిన ఆనంద్ దేవరకొండ.. బేబీ మూవీ నుంచి స్పెషల్ పోస్టర్ రిలీజ్..
Baby

Updated on: Jan 15, 2022 | 8:00 AM

రౌడీ హీరో విజయ్ దేవరకొండ తమ్ముడిగా దొరసాని సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు ఆనంద్ దేవరకొండ. మొదటి సినిమాతోనే తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు ఈ కుర్ర హీరో. సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోయినా ఆనంద్ నటనకు మంచి మార్కులు పడ్డాయి. ఈ సినిమా తర్వాత మిడిల్ క్లాస్ మెలోడీస్ అనే సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చి సక్సెస్ అయ్యారు ఈ యంగ్ హీరో. ఇప్పుడు బేబి అంటూ మరో మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. సంక్రాంతి సందర్భంగా ఆనంద్ దేవరకొండ నటిస్తోన్న బేబీ మూవీ నుంచి స్పెషల్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్.

న్యూ ఏజ్ లవ్ స్టొరీ గా తెరకెక్కుతున్న కొత్త సినిమా ‘బేబీ’. దర్శకుడు సాయి రాజేష్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ‘బేబీ’ సినిమా ప్రస్తుతం రెగ్యులర్ చిత్రీకరణ జరుపుకుంటోంది. ఈ చిత్రంలో ఆనంద్ దేవరకొండతోపాటు.. విరాజ్ అశ్విన్, వైష్ణవి చైతన్య లీడ్ రోల్స్ లో నటిస్తున్నారు. ‘బేబీ’ ఒక న్యాచురల్, ఇన్నోవేటివ్ లవ్ స్టోరి. ఈ సినిమా ఫ్లేవర్ ను
రిఫ్లెక్ట్ చేస్తూ ఒక కొత్త తరహా పోస్టర్ ను టీమ్ విడుదల చేసింది. గోడల మీద రాతలు మనకు బాగా తెలిసినవే. ఈ రాతల్లో ప్రేమ గురించి అనేక స్లోగన్స్, పోయెట్రీ కనిపిస్తుంటుంది. ప్రేమించుకానీ నటించకు రా, మనసులో ఉంచుకో, మళ్లీ వస్తా…ఇలాంటి కొటేషన్స్ లవర్స్ ఎక్స్ ప్రెషన్స్ ను చూపిస్తాయి. ఇలాంటి గోడ మీద రాతలతో పోస్టర్ డిజైన్ చేసి సంక్రాంతి విశెస్ తెలిపింది. ‘బేబీ’ టీమ్. సినిమా స్టోరీలాగే ఈ పోస్టర్ కూడా విభిన్నంగా ఉండి ఆకట్టుకుంటోంది.

విజయ్ దేవరకొండ తో టాక్సీవాలా లాంటి సూపర్ హిట్ సినిమా నిర్మించిన ఎస్. కె. ఎన్ ‘బేబీ’ సినిమాను ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఎస్ కే ఎన్, దర్శకుడు మారుతి సంయుక్త సంస్థ మాస్ మూవీ మేకర్స్ పతాకంపై ‘బేబీ’ సినిమా నిర్మితమవుతోంది.

Also Read: Samantha: స‌మంత‌కు మ‌రో క్రేజీ ఆఫ‌ర్‌.. సామ్ కోసం రంగంలోకి దిగుతోన్న మాట‌ల మాంత్రికుడు.?

Vijay Devarakonda: త‌న మ‌ద్ద‌తు చిరుకే అంటోన్న విజ‌య్ దేవ‌ర‌కొండ‌.. ట్రెండింగ్‌లో చిరు ట్వీట్‌..

Hari Hara Veera Mallu: ప‌వ‌న్, క్రిష్ సినిమా క‌థపై హింట్ ఇచ్చిన నిధి.. ఆస‌క్తి రేపుతోన్న స్టోరీ లైన్‌..

Loading...
Unable to load recommendations.
Follow Us