Pushpa Movie: “పుష్ప” షూట్ మళ్లీ ఆగిపోయిందా ? అసలు కారణం ఇదేనా..

స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో "పుష్ప" సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో రూపొందుతున్న

Pushpa Movie: పుష్ప షూట్ మళ్లీ ఆగిపోయిందా ? అసలు కారణం ఇదేనా..
Pushpa

Edited By:

Updated on: Jul 16, 2021 | 8:36 PM

స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో “పుష్ప” సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమాలో బన్నీ పూర్తిగా డీగ్లామర్ లుక్‏లో కనిపించబోతున్నారు. ఇందులో రష్మిక మందన్నా హీరోయిన్ గా నటిస్తుండగా.. మలయాళ స్టార్ హీరో ఫహద్ ఫాజిల్ విలన్‏గా కనిపించనున్నారు. ఇక ఈ మూవీ పై అంచనాలు భారీగానే ఉన్నాయి. పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కుతున్న ఈ సినిమాకు రెండు భాగాలుగా రూపొందించనున్నారు మేకర్స్. అయితే ఈ సినిమా మొదటి భాగాన్ని ఆగస్టు 13న ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని అనుకున్నారు. అయితే కరోనా ప్రభావం.. షూటింగ్ లేట్ అవ్వడం వంటి కారణాలతో అనుకున్న సమయానికి సినిమా పూర్తి చేసే అవకాశం లేకపోయింది.

ఇక కరోనా సెకండ్ వేవ్ లాక్ డౌన్ తర్వాత ఇటీవలే ‘పుష్ప’ సినిమా షూటింగ్ తిరిగి ప్రారంభించారు. హైదరాబాద్ లో 45 రోజుల పాటు నిర్విరామంగా జరిగే షెడ్యూల్ తో ‘పుష్ప’ పార్ట్-1 చిత్రీకరణ పూర్తి చేయాలని భావించారు. అయితే తాజా సమాచారం ప్రకారం పుష్ప షూటింగ్ మరోసారి ఆగిపోయిన్నట్లుగా టాక్ వినిపిస్తుంది. గత కొన్ని రోజులుగా హైదరాబాద్‏లో ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాల కారణంగా ‘పుష్ప’ షూటింగ్ స్పాట్ దెబ్బతిన్నదట. దీంతో పుష్ప షూటింగ్ కు మళ్లీ బ్రేక్ పడిందట. ఇక ఈ షెడ్యూల్ మరికొన్ని రోజులు పొడిగించాల్సి వస్తోందట. ఇందులో నిజమెంతో తెలియాల్సి ఉంది. ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఆస్కార్ అవార్డ్ గ్రహీత రసూల్ పూకుట్టి సౌండ్ డిజైనింగ్ చేస్తున్నారు. ఇందులో ప్రకాష్ రాజ్ – జగపతిబాబు – సునీల్ – యాంకర్ అనసూయ కీలక వంటి వారు కీలక పాత్రలు పోషిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ – ముత్యంశెట్టి మీడియా బ్యానర్స్ కలిసి ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.

Also Read: Telugu Actor Annapurna: కూతురు కీర్తిని జ్ఞాపకం చేసుకున్న అన్నపూర్ణ.. ఎందుకు అలా చేసిందో ఇప్పటికీ తెలియదంటూ కన్నీరు

MAA Elections 2021: “మా” ఎలక్షన్స్ పై బాలయ్య సంచలన వ్యాఖ్యలు.. కౌంటర్ ఇచ్చిన మెగా బ్రదర్..

Loading...
Unable to load recommendations.
Follow Us