
సదరన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ ‘అల వైకుంఠపురములో’. ఈ ఏడాది సంక్రాంతికి విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమా పాటలూ యూట్యూబ్‌లో రికార్డు స్థాయిలో వ్యూస్ దక్కించుకుంటున్నాయి. తాజాగా ఈ చిత్ర ఆల్బమ్ మరో ఘనతను సాధించింది.
ఈ సినిమా పాటలు జియో సావన్‌లో ఏకంగా 200 మిలియన్ ‘ప్లేస్’తో రికార్డు సాధించాయి. ఓ ప్రాంతీయ భాషా మూవీ పాటలకు ఈస్థాయిలో ఆదరణ దక్కడం విశేషం. 200 మిలియన్ ‘ప్లే’స్ మామూలు విషయంకాదు. అంటే జియో సావన్‌లో ఇప్పటి వరకు 20 కోట్ల సార్లు ఈ చిత్రం పాటలు విన్నారని అర్థం.