
టాలీవుడ్ నటుడు రానా దగ్గుబాటి, మిహీకా బజాజ్‌ల వివాహంపై స్పందించాడు బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్. పర్మనెంట్‌గా లాక్డౌన్ అవడానికి ఇదే సిసలైన మార్గం అంటూ ఫన్నీగా ట్వీట్ చేశాడు. “రానా దగ్గుబాటి… కంగ్రాట్స్. మీ జంట జీవితకాలం ఆనందంతో ఉండాలని ఆకాంక్షిస్తున్నా” అని అక్షయ్ పేర్కొన్నాడు.
ఇప్పటికే రానా-మిహీక పెళ్లి వేడుకకు రామానాయుడు స్టూడియో అందంగా ముస్తాబు అయింది. ఆగస్టు 8న(ఈరోజు) రాత్రి 8.30 గంటలకి రానా దగ్గుబాటి తన ఫ్రెండ్ మిహీకా బజాజ్ మెడలో మూడు ముళ్లు వేయనున్నాడు.