Akkineni Hero: బాలీవుడ్‌ బాట పట్టనున్న అక్కినేని వారబ్బాయి..? అమీర్‌ ఖాన్‌ చిత్రంలో కీలకపాత్రలో నటించనున్న…

Akkineni Hero Bollywood Entry: తెలుగులో అభిమానులను సంపాదించుకున్న చాలా మంది హీరోలు బాలీవుడ్‌ బాట పట్టిన విషయం తెలిసిందే. మరీ ముఖ్యంగా పాన్‌ ఇండియా చిత్రాల సందడి మొదలు కావడంతో తెలుగు హీరోలు...

Akkineni Hero: బాలీవుడ్‌ బాట పట్టనున్న అక్కినేని వారబ్బాయి..? అమీర్‌ ఖాన్‌ చిత్రంలో కీలకపాత్రలో నటించనున్న...
Ameerkhan

Updated on: Mar 16, 2021 | 1:47 AM

Akkineni Hero Bollywood Entry: తెలుగులో అభిమానులను సంపాదించుకున్న చాలా మంది హీరోలు బాలీవుడ్‌ బాట పట్టిన విషయం తెలిసిందే. మరీ ముఖ్యంగా పాన్‌ ఇండియా చిత్రాల సందడి మొదలు కావడంతో తెలుగు హీరోలు బాలీవుడ్‌ చిత్రాల్లో నటించడం ఎక్కువైంది. ఈ జాబితాలో ప్రభాస్‌, విజయ్‌ దేవరకొండ, రానా ఇలా చాలా మంది యువ హీరోలున్నారు.
అయితే తాజాగా ఈ లిస్ట్‌లోకి మరో యంగ్‌ హీరో వచ్చి చేరనున్నట్లు తెలుస్తోంది. అతనే అక్కినేని నట వారసుడు నాగచైతన్య. తెలుగులో మంచి ఫీల్‌ గుడ్‌ మూవీస్‌లో నటిస్తూ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంటున్న నాగచైతన్య తాజాగా బాలీవుడ్‌లో ఓ చిత్రంలో నటించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. అది కూడా అమీర్‌ ఖాన్‌లాంటి అగ్ర హీరో నటిస్తోన్న చిత్రంలో కావడం విశేషం. అమీర్‌ ఖాన్‌ హీరోగా లాల్‌ సింగ్‌ చడ్డా అనే సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో అమీర్‌ ఖాన్‌తో పాటు మరో కీలక పాత్ర ఉంటుంది. ఇందుకోసం తొలుత తమిళ హీరో విజయ్‌ సేతుపతిని ఎంచుకున్నారు. అయితే విజయ్‌ డేట్స్‌ను అడ్జెస్ట్‌ చేయకపోయేసరికి చివరి క్షణాన నాగచైతన్యను తీసుకోవాలని చిత్ర యూనిట్‌ ఫిక్స్‌ అయినట్లు బీటౌన్‌లో వార్తలు షికార్లు చేస్తున్నాయి. మరి ఈ వార్తలో ఎంత వరకు నిజం ఉందో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే. ఇదిలా ఉంటే నాగచైతన్య ప్రస్తుతం తెలుగులో శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో ‘లవ్‌స్టోరీ’తో పాటు విక్రమ్‌ కుమార్‌ దర్శకత్వంలో ‘థాంక్యూ’ అనే సినిమాలో నటిస్తున్నాడు.

Nag Chaithanya

Also Read: Aamir Khan : అమీర్ ఖాన్ సంచలన నిర్ణయం.. సోషల్ మీడియాను విడిచిపెడుతున్నట్లు ప్రకటన.. ఎందుకో తెలుసా..

చిక్కుల్లో కేజీఎఫ్ హీరో యశ్‌.. రౌడీలతో భయపెడుతున్నాడంటూ ఆరోపణ.!! కలెక్టర్‌కు ఫిర్యాదు.!

గుడ్ న్యూస్ చెప్పిన హర్భజన్ సతీమణి.. త్వరలో మరో బిడ్డకు జన్మనివ్వబోతున్న భజ్జీ దంపతులు.