అక్కినేని యువ సామ్రాట్ అఖిల్( Akhil Akkineni) వరుస సినిమాలతో జోరు పెంచాడు. ఇటీవలే మోస్ట్ ఎలిజిబుల్ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నాడు. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో పూజాహెగ్డే హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాతో చాలా కాలం తర్వాత హిట్ అందుకున్నాడు అఖిల్. ఇక ఇప్పుడు స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు ఈ యంగ్ హీరో. ఏజెంట్(Agent) అనే టైటిల్ తో తెరకెక్కుతోన్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్‌తో డిసెంట్ హిట్‌ను అందుకున్న అఖిల్ ఈసారి ఎలాగైనా భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకోవాలనే కసితో ఉన్నాడు. ఈ క్రమంలోనే ఏజెంట్ చిత్రం కోసం తన మేకోవర్‌ను పూర్తిగా మార్చేశాడు. సిక్స్ ప్యాక్ బాడీతో హాలీవుడ్ హీరోలను తలదన్నేలా మారిపోయాడు. అఖిల్ ఏజెంట్ లుక్ చూస్తే ఈ సినిమా కోసం ఆయన ఎంత కష్టపడ్డాడో అర్థమవుతోంది.
ముందుగా ఈ సినిమాను ఆగస్టు 12వ తేదీన ఈ సినిమాను విడుదల చేయాలనుకున్నారు. కానీ ఇప్పుడు రిలీజ్ డేట్ ను మార్చనున్నారట మేకర్. ఈ సినిమాను దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నట్టు టాక్ వినిపిస్తోంది. . ముందుగా అనుకున్న సమయానికి సినిమాను రిలీజ్ చేయడానికి కుదరకపోవడంతో గట్టిపోటీ ఉన్నప్పటికీ దసరాను ఎంచుకున్నారట చిత్రయూనిట్. త్వరలోనే ఈ విషయం పై క్లారిటీ రానుంది. ఇక ఈ సినిమాలో కీలకమైన పాత్రలో మమ్ముట్టి కనిపించనున్నాడు. హిపాప్ తమిజా ఈ సినిమాకి సంగీతాన్ని సమకూర్చుతున్నాడు.