Pattudala Review: హిట్టా..? ఫట్టా..? అజిత్ పట్టుదల ప్రేక్షకులను ఆకట్టుకుందా..?

Updated on: Feb 07, 2025 | 4:32 PM

పబ్లిసిటీకి దూరంగా ఉండే హీరో..! ఓ సినిమా చేశాక.. ఆ సినిమాను ప్రమోట్ చేసుకోవడంలో.. అసలు పార్టిసిపేట్ చేయని హీరో..! ఇంకో మాటలో చెప్పాలంటే.. సినిమా చేయడం.. అది రిలీజ్ అవుతుందా లేదా అనేది పట్టించుకోకుండా.. తన పనేదో తాను చేసుకుంటూ పోవడం! ఇది కరెక్టేనా? కాదా? అనేది పక్కకు పెడితే.. అజిత్ స్టైల్‌ ఇది! ఎన్నో ఏళ్లుగా ఆయన చేస్తుంది కూడా ఇదే! అలాంటి అజిత్ తాజాగా విడాముయార్చి.. అదే తెలుగులో పట్టుదల సినిమాతో మన ముందుకు వచ్చారు. యాక్షన్ అడ్వెంచరస్ డ్రామా తెరకెక్కిన ఈ సినిమా తెలుగు వర్షన్ ఎలా ఉంది? మన వాళ్లకు నచ్చుతుందా లేదా? అనేది ఇప్పుడు చూద్దాం..!

అర్జున్ అలియాస్ అజిత్, కయాల్ అలియాస్ త్రిష ప్రేమించి పెళ్లి చేసుకుంటారు. పన్నెండేళ్ల తరువాత వైవాహిక బంధానికి కయాల్ స్వస్తి పలకాలని అనుకుంటుంది. కయాల్‌కు వివాహేతర సంబంధం ఉంటుంది. ఇక ఈ విషయం తెలిసినా కూడా తాను ఎంతో ప్రేమించిన కయాల్‌కు నచ్చజెప్పే ప్రయత్నం చేస్తాడు అర్జున్. కానీ కయాల్ మాత్రం విడాకులు కోరుకుంటుంది. ఈ క్రమంలో కయాల్ తన పుట్టింటికి వెళ్దామని నిశ్చయించుకుంటుంది. కయాల్‌ను తన పుట్టింట్లో దిగబెట్టేందుకు అర్జున్ వస్తానని అంటాడు. అదే తమ చివరి ప్రయాణం అవుతుంది కదా.. తానే దగ్గరుండి దిగబెట్టి వస్తానని అర్జున్ అంటాడు. ఈ ప్రయాణంలో అర్జున్, కయాల్‌కు ఎదురైన సమస్యలు ఏంటి? కయాల్‌ను ఎవరు కిడ్నాప్ చేస్తారు? అసలు కయాల్‌, అర్జున్‌లకు ఎదురైన సమస్యలు ఏంటి? ఈ ప్రయాణంలో దీపిక అలియాస్ రెజీనా, రక్షిత్ అలియాస్ అర్జున్ సర్జాల పాత్ర ఏంటి? చివరకు తన భార్యను కాపాడుకునేందుకు పట్టుదలతో అర్జున్ చేసిన పోరాటాలు, ప్రయత్నాలు ఏంటి? అన్నది ఈ సినిమా స్టోరీ!