
సోషల్ మీడియా పుణ్యమా అని చాలా మంది సెలబ్రెటీలు ట్రోల్స్ బారిన పడుతుంటారు. సినిమా సెలబ్రెటీలకు సోషల్ మీడియాలో ఎంత క్రేజ్ ఉంటుందో.. దాని వల్ల నష్టం కూడా అంతే ఉంటుంది. సోషల్ మీడియా ద్వారా చాలా మంది సెలబ్రెటీలు, ముఖ్యంగా హీరోయిన్స్ ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఊహించని రేంజ్ లో ట్రోల్స్ బారిన పడ్డారు. కొంతమంది హీరోయిన్స్ చాలా మంది లేనిపోని వివాదాల్లో ఇరుక్కుంటూ ఉంటారు. వివాదాస్పద కామెంట్స్ చేసో లేక, వింత డ్రస్సుల వల్లో ఎదో ఒకరకంగా ట్రోల్స్ కు గురవుతూ ఉంటారు. కొంతమంది హీరోయిన్స్ తమ డ్రస్సింగ్ కారణంగా ట్రోల్స్ బారిన పడుతూ ఉంటారు. వారిలో ఈ హీరోయిన్ ముందు వరసలో ఉంటుంది. తాజాగా ఆమె గురించి సోషల్ మీడియాలో ఓ వార్త తెగ వైరల్ అవుతుంది. ఆ హీరోయిన్ ను వెలిశారు అంటూ రకరకాల వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. దాని పై ఆమె క్లారిటీ ఇచ్చారు.
నెట్టింట ఎక్కువగా వినిపించే పేర్లలో ఉర్ఫీ జావేద్ ఒకరు. ఈ బాలీవుడ్ బ్యూటీకి సోషల్ మీడియాలో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. డిఫరెంట్ డిఫరెంట్ డ్రస్సుల్లో కనిపిస్తూ అభిమానులకు షాక్ ఇస్తుంటుంది ఈ అమ్మడు. ఉర్ఫీ జావేద్ ఎలాంటి దుస్తులు దరిస్తుందో ఊహించడం చాలా కష్టం. ఉర్ఫీ జావేద్ తరచూ ఆమె దుస్తులపై విమర్శలు ఎదుర్కొంటుంది. ఉర్ఫీ జావేద్ ఎప్పుడూ హాట్ టాపిక్ గా ఉంటుంది. ఉర్ఫీ జావేద్ టీవీ నటిగా కెరీర్ మొదలు పెట్టిన ఈ చిన్నది బిగ్ బాస్ ద్వారా మంచి క్రేజ్ తెచ్చుకుంది. ఉర్ఫీ జావేద్ చిత్ర విచిత్రమైన డ్రస్సులో కనిపిస్తూ ఉంటుంది. ఇదిలా ఉంటే ఉర్ఫీని ముస్లిం మతం నుంచి వెలేశారని.. దాంతో ఆమె పేరు మార్చుకుందని ఓ వ్యక్తి నెట్టింట కామెంట్స్ చేశాడు.
ఉర్ఫీ జావేద్ వల్ల ముస్లిం కమ్యూనిటీ పరువు పోతోందని.. అందుకే ముస్లిం సమాజం ఆమెను మతం నుంచి బహిష్కరించిందని, అంతేకాదు, ఆమె పేరును ఇకపై గీతా భరద్వాజ్ గా మార్చుకుంది అని ఆ వ్యక్తి చెప్పుకొచ్చాడు. దీని పై ఉర్ఫీ జావేద్ స్పందించింది. ఆ వార్తల్లో వాస్తవం లేదని.. అది తప్పుడు ప్రచారం అని కొట్టిపారేసింది. నేను ఏ మతాన్ని ఫాలో అవ్వను. నేను నాస్తికురాలిని, నేను ఎప్పుడో మతం నుంచి బయటికి వచ్చేశాను అని చెప్పుకొచ్చింది ఉర్ఫీ జావేద్. ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..