Actress : దుస్తులు విప్పేసి డ్యాన్స్ చేయ్.. ఆ డైరెక్టర్ ఇబ్బంది పెట్టాడు.. టాలీవుడ్ హీరోయిన్ సంచలన కామెంట్స్..

ఈమధ్య కాలంలో హీరోయిన్లు తమకు ఎదురైన చేదు అనుభవాలను బయటపెడుతున్నారు. తాజాగా ఓ హీరోయిన్ సైతం తాను ఇబ్బందిపడిన క్షణాలను పంచుకున్నారు. తనతో సెట్ లో అసభ్యకరంగా ప్రవర్తించారని తెలిపింది. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరు.. ? ఏం చెప్పిందో తెలుసుకుందామా?

Actress : దుస్తులు విప్పేసి డ్యాన్స్ చేయ్.. ఆ డైరెక్టర్ ఇబ్బంది పెట్టాడు.. టాలీవుడ్ హీరోయిన్ సంచలన కామెంట్స్..
Thanusree Datta

Updated on: Dec 31, 2025 | 9:06 PM

టాలీవుడ్ హీరోయిన్ తనుశ్రీ దత్తా గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆమె ఎక్కువగా ముక్కుసూటిగా మాట్లాడుతూ నిత్యం వార్తలలో నిలుస్తుంది. ఒకప్పుడు వరుస సినిమాలతో అలరించిన ఆమె.. ఇప్పుడు ఏదో ఒక కారణం చేత సోషల్ మీడియాలో నిరంతరం వార్తల్లో నిలుస్తూనే ఉంది. మీటూ ఉద్యమం సమయంలో ఆమె మరో నటుడిపై తీవ్ర ఆరోపణలు చేసింది. అలాగే ఇప్పుడు ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఒక దర్శకుడు తనతో అనుచితంగా ప్రవర్తించాడని తెలిపింది. ఆ డైరెక్టర్ తనతో డిమాండ్ చేస్తూ అసభ్యకరంగా మాట్లాడారని గుర్తు చేసుకుంది.

ఇవి కూడా చదవండి : Ranu Bombaiki Ranu Song : యూట్యూబ్ సెన్సేషన్.. రానూ బొంబాయికి రాను పాటకు ఎంత అమౌంట్ ఇచ్చారంటే.. డ్యాన్సర్ లిఖిత కామెంట్స్..

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న తనుశ్రీ దత్తా మాట్లాడుతూ. “నువ్వు అంత పెద్ద దర్శకురాలివి కావు.. ఎందుకు అంత దురుసుగా మాట్లాడుతున్నావు.. దుస్తులు తీసేసి డ్యాన్స్ చేయ్.. అని అతడు నాతో చెప్పాడు. ఆ సమయంలో నేను మౌనంగా ఉన్నాను. అతడి వైపు చూసి సైలెంట్ అయ్యాను. అక్కడ నిలబడిన ఇతర నటీనటులు మాత్రం చాలా బాధపడ్డారు. అందరూ అతడు మాట్లాడేది తప్పు అని భావించారు. మీటూ ప్రచార సమయంలో ఎవరు ముందుకు వచ్చి మాట్లాడలేదు. ఆ సమయంలో అందరూ నన్ను సపోర్ట్ చేశారు. ఆ తర్వాత దర్శకుడు మౌనంగా ఉన్నాడు” అంటూ చెప్పుకొచ్చింది.

ఇవి కూడా చదవండి : Upendra : ఉపేంద్రతో ప్రేమాయణం.. ఇన్నాళ్లకు ఓపెన్ అయిన హీరోయిన్.. ఏమన్నారంటే..

“ఆ సన్నివేశంలో, నా వేషధారణ కొంచెం స్పష్టంగా ఉంది. నీ దుస్తులు విప్పి డ్యాన్స్ చేయ్ అని ఆ డైరెక్టర్ చెప్పాడు. మళ్లీ అతడే బయటకు వచ్చి ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు” అని తను శ్రీ తెలిపింది. ప్రస్తుతం ఆమె చేసిన కామెంట్స్ నెట్టింట వైరలవుతున్నాయి.

ఇవి కూడా చదవండి :  Actor Suresh: సౌందర్య భర్త ఇప్పుడేం చేస్తున్నారంటే.. ఒక్క మాటలో చెప్పేసిన సీనియర్ హీరో..

Thanusree Datta News

ఇవి కూడా చదవండి :  Folk Song : యూట్యూబ్‏లో కోట్ల వ్యూస్.. నెల రోజులుగా ఇంటర్నెట్ షేక్.. ఇప్పటికీ దూసుకుపోతున్న పాట..