ప్రస్తుతం టాలీవుడ్ సెలబ్రెటీలంతా వెకేషన్స్ అంటూ తెగ హడావిడి చేసేస్తున్నారు. సన్నిహితులతో కలిసి విదేశాల్లో ఎంజాయ్ చేస్తున్నారు. అందుకు సంబంధించిన ఫోటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. పైన ఫోటోలో ఉన్న ఆ ముద్దుగుమ్మ ఎవరో గుర్తుపట్టండి… ఎడారి అందాలను ఆస్వాదిస్తూనే.. మోము దాచేసి ఫోటోలకు ఫోజులిస్తున్న ఈ అమ్మడు.. టాలీవుడ్ ఇండస్ట్రీలోనే క్రేజీ హీరోయిన్. ఆ స్టార్ హీరో వారసురాలిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి.. అందం, అభినయంతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. మొదటి సినిమాతోనే నటనగా పరంగా మంచి మార్కులు కొట్టేసిన ఈ అమ్మడు.. ఆ తర్వాత వరుస ఆఫర్లతో దూసుకుపోతుంది. ఇప్పటివరకు ఈ అమ్మడు నటించిన సినిమాలన్ని సూపర్ హిట్. ఎవరో గుర్తుపట్టండి..
ఎవరో గుర్తపట్టారా ?.. ఆ ముద్దుగుమ్మ మరెవరో కాదండోయ్.. స్టార్ హీరో రాజశేఖర్ గారాలపట్టి హీరోయిన్ శివాత్మిక. దొరసాని సినిమాతో తెలుగు తెరకు హీరోయిన్గా పరిచయమైన ఈ అమ్మడు. మొదటి సినిమాలోనే తన నటనతో కట్టిపడేసింది శివాత్మిక.. రంగమార్తాండ, విధివిలాసం వంటి చిత్రాల్లో నటించి మెప్పించింది. ప్రస్తుతం శివాత్మిక పంచతంత్రం సినిమాలో నటిస్తుంది. కేవలం తెలుగులోనే కాకుండా..తమిళంలోనూ వరుస ఆఫర్లు అందుకుంటూ దూసుకుపోతుంది.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
Also Read: Hari Hara Veeramallu: హరిహర వీరమల్లు నుంచి క్రేజీ అప్డేట్.. పవన్ సినిమాలో ఆ బాలీవుడ్ బ్యూటీ ?..
Ram Charan: బాబాయ్‌తో సినిమా చేయాలని ఉంది.. ఆసక్తికర కామెంట్స్ చేసిన రామ్ చరణ్..
Health Tips: వీటితోపాటు ట్యాబ్లెట్స్ అస్సలు తీసుకోవద్దు.. మర్చిపోతే ప్రాణాలకే ప్రమాదం..