Sai Pallavi: నేను చెప్పాలనుకుంది అది కాదు.. ఇక పై జాగ్రత్తగా మాట్లాడతా: సాయి పల్లవి

బాలీవుడ్ చాక్లెట్ బాయ్ రణ్‌బీర్ కపూర్, సౌతిండియన్ న్యాచురల్ బ్యూటీ సాయిపల్లవి సీతారాములుగా నటిస్తోన్న సినిమా రామాయణ. దంగల్ ఫేమ్ నితీశ్ తివారీ తెరకెక్కించిన ఈ పాన్ ఇండియన్ మైథలాజికల్ మూవీలో కన్నడ స్టార్ యశ్ రావణుడిగా కనిపించనున్నాడు. ఇప్పటికే అన్ని హంగులు పూర్తి చేసుకున్న ఈ సినిమా నవంబర్ 05న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది.

Sai Pallavi: నేను చెప్పాలనుకుంది అది కాదు.. ఇక పై జాగ్రత్తగా మాట్లాడతా: సాయి పల్లవి
Sai Pallavi

Updated on: Nov 03, 2026 | 7:23 PM

సహజ నటన, వైవిధ్యమైన పాత్రలతో దక్షిణాది ప్రేక్షకుల గుండెల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న నటి సాయిపల్లవి. ఎలాంటి గ్లామర్ హంగులు లేకపోయినా, కేవలం తన నటనా ప్రతిభతోనే తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో స్టార్ హీరోయిన్‌గా ఎదిగారు. కథల ఎంపికలో ఎంతో శ్రద్ధ చూపే ఈ బ్యూటీ, ఇప్పుడు ప్రతిష్టాత్మక చిత్రాలతో బాలీవుడ్‌లోనూ తన ముద్ర వేసేందుకు సిద్ధమవుతున్నారు. అయితే ఆమె నటించిన సినిమాల కంటే, వివిధ సందర్భాల్లో ఆమె చేసే వ్యాఖ్యలే సోషల్ మీడియాలో ఎక్కువగా హాట్ టాపిక్‌గా మారుతుంటాయి. తాజాగా ‘రామాయణ’ ప్రమోషన్లలో సాయిపల్లవి చేసిన వ్యాఖ్యలు నెట్టింట మరోసారి తీవ్ర చర్చకు దారితీశాయి. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా సినీ అభిమానులు అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం ‘రామాయణ’. నితీష్ తివారీ దర్శకత్వంలో భారీ బడ్జెట్‌తో అంతర్జాతీయ స్థాయిలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రణ్‌బీర్ కపూర్ (రాముడు), కన్నడ స్టార్ యష్ (రావణుడు) ప్రధాన పాత్రల్లో నటిస్తుండగా, సాయిపల్లవి సీతమ్మ పాత్రలో కనిపించనున్నారు.

ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా అక్టోబర్ 27న లాస్ ఏంజెలెస్‌లో ఒక ప్రత్యేక ప్రీమియర్ నిర్వహించారు. ఈ సందర్భంగా అంతర్జాతీయ ప్రేక్షకులు రామాయణాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? అనే ప్రశ్నకు సాయిపల్లవి స్పందిస్తూ “ఈ ఇతిహాసం ద్వారా ప్రతి ఒక్కరూ తమలోని మంచి, చెడులను గుర్తించి ఆత్మపరిశీలన చేసుకోవాలి. రావణుడు పూర్తిగా చెడ్డవాడేమీ కాదు. మనందరిలోనూ కొన్ని ప్రతికూల లక్షణాలు (నెగెటివ్ క్వాలిటీస్) ఉంటాయి. వాటిని గుర్తించి కాలక్రమేణా మార్చుకోవడమే ముఖ్యం” అని చెప్పుకొచ్చింది.  రావణుడిని ఉద్దేశించి సాయిపల్లవి ఉపయోగించిన పదాలపై నెట్టింట భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు నెటిజన్లు తీవ్రంగా తప్పుబడుతున్నారు. మరికొందరు మాత్రం సాయి పల్లవికి మద్దతుగా నిలుస్తున్నారు. రావణుడి తప్పులను సమర్థించడం ఆమె ఉద్దేశం కాదని, మానవ నైజంలో ఉండే మంచి, చెడుల అంతరార్థాన్ని మాత్రమే చెప్పడానికి ప్రయత్నించారని స్పష్టం చేస్తున్నారు.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి. తనలో ఇంకా మెరుగుపరుచుకోవాల్సిన అంశం ఏమిటని అడిగిన ప్రశ్నకు సాయిపల్లవి ఎంతో నిజాయతీగా స్పందించింది. తన మనసులో ఉన్న భావాలను ఇతరులకు స్పష్టంగా వివరించడంలో కొన్నిసార్లు ఇబ్బంది పడుతుంటానని చెప్పింది సాయి పల్లవి. తాను చెప్పాలనుకున్న విషయం ఒకటైతే.. ఎదుటివారు మరో విధంగా అర్థం చేసుకునే పరిస్థితులు ఎదురవుతున్నాయని ఆమె చెప్పుకొచ్చింది. ఒక సెలబ్రిటీగా తాను మాట్లాడే ప్రతి మాటకు ఎక్కువ ప్రాధాన్యత ఉంటుందని, అందుకే తన కమ్యూనికేషన్ స్కిల్స్‌ను మరింత మెరుగుపరుచుకోవాల్సిన అవసరం ఉందని సాయి పల్లవి పేర్కొంది. ఇకపై తన ఆలోచనలను మరింత స్పష్టంగా, బాధ్యతాయుతంగా వ్యక్తపరిచేందుకు ప్రయత్నిస్తానని తెలిపింది సాయి పల్లవి. ఇక ‘రామాయణ’ మొదటి భాగం నవంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది. ఇక రెండో భాగాన్ని 2027 దీపావళి కానుకగా విడుదల చేయడానికి నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Loading...
Unable to load recommendations.
Follow Us