Sai Pallavi: విజయ్ దళపతి సరసన సాయి పల్లవి.. షాకింగ్ కామెంట్స్ చేసిన న్యాచురల్ బ్యూటీ..

డైరెక్టర్ వేణు ఉడుగుల, రానా దగ్గుబాటి, సాయి పల్లవి కాంబోలో వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. ఈ మూవీ తర్వాత సాయి పల్లవి నటిస్తోన్న లేటేస్ట్ చిత్రం గార్గి.

Sai Pallavi: విజయ్ దళపతి సరసన సాయి పల్లవి.. షాకింగ్ కామెంట్స్ చేసిన న్యాచురల్ బ్యూటీ..
Sai Pallavi

Updated on: Jul 09, 2022 | 4:16 PM

ఇటీవల విరాట పర్వం సినిమాతో థియేటర్లలో సందడి చేసింది సాయి పల్లవి (Sai Pallavi). ఈ మూవీలో వెన్నెల పాత్రలో నటించి సినీ ప్రియులు, విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకుంది. డైరెక్టర్ వేణు ఉడుగుల, రానా దగ్గుబాటి, సాయి పల్లవి కాంబోలో వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. ఈ మూవీ తర్వాత సాయి పల్లవి నటిస్తోన్న లేటేస్ట్ చిత్రం గార్గి. ఈ సినిమాను తమిళ్ వెర్షన్ ను జ్యోతిక, సూర్య సొంత ప్రొడక్షన్ హౌస్ 2డీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ పోస్టర్స్, వీడియోస్, ట్రైలర్ గార్గి పై మరింత ఆసక్తిని క్రియేట్ చేశాయి.

ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ సినిమాను జూలై 15న విడుదల చేయనున్నారు. ప్రస్తుతం ఈ మూవీ ప్రమోషన్లలో పాల్గొంటూ బిజీగా గడిపేస్తుంది న్యాచురల్ బ్యూటీ. ఈ క్రమంలో తాను తమిళ్ స్టార్ విజయ్ దళపతితో కలిసి నటించేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు మనసులోని మాటను బయటపెట్టింది. సాయి పల్లవి మాట్లాడుతూ.. ” మంచి స్క్రిప్ట్ వస్తే కచ్చితంగా విజయ్ దళపతితో నటించేందుకు సిద్ధంగా ఉన్నాను” అంటూ చెప్పుకొచ్చింది. 2017లో బిహైండ్ వుడ్స్ అవార్డ్ వేడుకలో సాయి పల్లవి మొదటి సారి విజయ్ ను కలుసుకుంది. దళపతి పలకరించిన వెంటనే న్యాచురల్ బ్యూటీ ఎమోషనల్ అయిన సంగతి తెలిసిందే. తాను విజయ్ దళపతికి వీరాభిమానని చెప్పింది. గార్గి సినిమాలో కాళీ వెంకట్, ఆర్ఎస్ శివాజీ, కలైమామణి శరవణన్, జయప్రకాష్, ప్రతాప్, సుధ కీలకపాత్రలలో నటించారు.

Loading...
Unable to load recommendations.
Follow Us