Tollywood: ఆ స్టార్ హీరో సినిమాలో నటిస్తే చెత్తగా చూపించారు.. ఆ మూవీ చేయడమే నా తప్పు.. నయనతార..

లేడీ సూపర్ స్టార్ నయనతార.. దాదాపు రెండు దశాబ్దాలుగా సినీరంగంలో అగ్రకథానాయికగా దూసుకుపోతుంది. ఇటీవలే మెగాస్టార్ చిరంజీవి జోడిగా మన శంకర వరప్రసాద్ గారు సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఏకంగా రూ.300 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. ఇప్పటికీ చేతినిండా ప్రాజెక్టులతో బిజీగా ఉంది ఈ ముద్దుగుమ్మ.

Tollywood: ఆ స్టార్ హీరో సినిమాలో నటిస్తే చెత్తగా చూపించారు.. ఆ మూవీ చేయడమే నా తప్పు.. నయనతార..
Nayanthara

Updated on: Mar 02, 2026 | 7:55 PM

సౌత్ ఇండస్ట్రీలో లేడీ సూపర్ స్టార్ అంటే ఠక్కున గుర్తొచ్చే పేరు నయనతార. వరుసగా బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకుంటూ కుర్ర హీరోయిన్లకు సైతం గుబులు పుట్టిస్తోంది. లేడీ ఓరియెంటెడ్ చిత్రాలకు కేరాఫ్ గా మారింది. అలాగే స్టార్ హీరోల సినిమాల్లోనూ నటిస్తుంది. తమిళంలో బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్న ఈ ముద్దుగుమ్మ.. ఇటీవల మెగాస్టార్ చిరంజీవి జోడిగా మన శంకరవరప్రసాద్ గారు మూవీతో మరో హిట్టు అందుకుంది. డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ.300 కోట్లకు పైగా వసూల్లు రాబట్టింది. మరోవైపు మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ టాక్సిక్ చిత్రంలోనూ నటిస్తుంది. ఈ చిత్రానికి భారీగానే పారితోషికం తీసుకుంటున్నట్లు టాక్. ఇదిలా ఉంటే.. గతంలో నయనాతర చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. కెరీర్ మొదట్లో తీసుకున్న నిర్ణయాలు, చేసిన సినిమాల గురించి ఆసక్తికర విషయాలు పంచుకుంది.

ఎక్కువ మంది చదివినవి : Folk Singer : ఒక్క పాటతో యూట్యూబ్ సెన్సేషన్.. ఎర్ర ఎర్ర రుమాల్ పాటకు ఎంత రెమ్యునరేషన్ ఇచ్చారంటే..

గతంలో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఆమె గజినీ సినిమా గురించి ప్రస్తావించింది. తన కెరీర్ లో చేసిన అతిపెద్ద తప్పు ఏదైనా ఉందంటే.. అది గజిని సినిమా చేయడమే అని అన్నారు. ఆ మూవీలో రెండవ హీరోయిన్ గా చేయడం తాను చేసిన తప్పు అని.. కథ చెప్పినప్పుడు తనకు చాలా నచ్చిందని అన్నారు. కానీ ఫైనల్ అవుట్ పుట్ లో తన పాత్ర అలా లేదని.. చాలా సీన్స్ కట్ చేశారని.. అందులో తనను కేవలం గ్లామర్ డాల్ గా మాత్రమే చూపించారని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఆమె కామెంట్స్ నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.

ఎక్కువ మంది చదివినవి : Jagapathi Babu: ఆ హీరోను ప్రతిరోజూ తలుచుకుంటా.. బతికితే అతడిలా బతకాలి.. జగపతి బాబు..

గజినీ సినిమా విషయానికి వస్తే.. డైరెక్టర్ ఏఆర్ మురుగదాస్ తెరకెక్కించిన ఈ సినిమాలో సూర్య హీరోగా నటించారు. ఇందులో ఆసిన్,నయనతార హీరోయిన్లుగా నటించారు. 2005లో వచ్చిన ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ఇదే చిత్రాన్ని అమీర్ ఖాన్ హిందీలో రీమేక్ చేయగా.. అక్కడ సైతం సూపర్ హిట్ అయ్యింది.

ఎక్కువ మంది చదివినవి : Tollywood : సందీప్ రెడ్డి వంగాకు మెసేజ్ చేసి పిచ్చోడిని అయిపోయా.. టాలీవుడ్ హీరో..

Ghajini Movie

ఎక్కువ మంది చదివినవి : Tollywood : రజినీకాంత్ చేసిన ఆ ఒక్క హెల్ప్‏తో చిరంజీవి లైఫ్ మారిపోయింది.. టాలీవుడ్ నటుడు..

Follow Us