నన్ను క్షమించు అమ్మా.. మాట వినాల్సింది! ఎమోషనల్ అయిన టాలీవుడ్ హీరోయిన్

కొత్త అందాలు ఎప్పటికప్పుడు ప్రేక్షకులను అలరిస్తున్నాయి. సినిమా సినిమాకు కొత్త హీరోయిన్స్ పరిచయం అవుతున్నారు. ఇదే సమయంలో కొందరు హీరోయిన్స్ ఒకటి రెండు సినిమాలతోనే పాపులర్ అవుతున్నారు. చాలా మంది హీరోయిన్స్ ఓవర్ నైట్ లోనే స్టార్ గా మారిపోయారు .

నన్ను క్షమించు అమ్మా.. మాట వినాల్సింది! ఎమోషనల్ అయిన టాలీవుడ్ హీరోయిన్
Actress

Updated on: Nov 22, 2026 | 7:26 AM

సినిమాలతో పాటు సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉండే టాలీవుడ్ హీరోయిన్ నభా నటేష్ తాజాగా పెట్టిన ఓ ఎమోషనల్ పోస్ట్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. తన తల్లిని ఉద్దేశిస్తూ ఆమె చేసిన ఈ పోస్ట్ ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. అమ్మ చెప్పిన మాటలను పట్టించుకోకుండా తనకు అన్నీ తెలుసని భావించినందుకు క్షమాపణలు చెబుతూ నభా ఆసక్తికరమైన నోట్‌ను షేర్ చేసింది. నభా నటేష్ తన పోస్ట్‌లో తల్లికి సంబంధించిన ఓ ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించారు. చాలా కాలంగా అమ్మ ఇచ్చే సలహాలను పెద్దగా పట్టించుకోలేదని, తనకు తానే ఎక్కువ తెలుసని అనుకునేదాన్నని తెలిపింది. అయితే ఇప్పుడు మాత్రం అమ్మ చెప్పిన మాటల్లోనే నిజం ఉందని అర్థమైందని చెప్పుకొచ్చింది. ముఖ్యంగా ఆరోగ్యం విషయంలో తల్లి చెప్పే సూచనలను నిర్లక్ష్యం చేసినట్లు నభా తెలిపింది. ఏం తినాలి? ఎప్పుడు నిద్రపోవాలి? అతిగా ఆలోచించడం ఎప్పుడు తగ్గించుకోవాలి? కడుపు సమస్యలు వచ్చినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? వంటి విషయాల్లో అమ్మకు ఎంతో అవగాహన ఉందని చెప్పుకొచ్చింది.

ఏదైనా సమస్య వచ్చినప్పుడు ముందుగా అమ్మను అడగాల్సింది పోయి గూగుల్‌లో సెర్చ్ చేస్తానని, సోషల్ మీడియాలో రీల్స్ చూస్తానని, స్నేహితులను సంప్రదిస్తానని నభా సరదాగా  పేర్కొంది. రకరకాల చిట్కాలు ప్రయత్నిస్తానని, కానీ మొదట సలహా తీసుకోవాల్సిన అమ్మనే చివరికి అడుగుతానని తన తప్పును అంగీకరించింది. అంతేకాదు.. అమ్మ చెప్పిందే కరెక్ట్ అని అందరి ముందు ఒప్పుకోవడం కొంచెం కష్టంగా ఉన్నప్పటికీ, ఈసారి మాత్రం నిజాన్ని అంగీకరిస్తున్నానని తెలిపింది. తన తల్లి మాట విననందుకు బహిరంగంగానే క్షమాపణలు చెప్పింది. అమ్మ మళ్లీ ‘నేను ముందే చెప్పాను కదా!’ అని అనకముందే సారీ చెబుతున్నానంటూ సరదగా రాసుకొచ్చింది.

ఈ సందర్భంగా ‘అమ్మకు అన్నీ తెలుసు’, ‘క్షమించు అమ్మా’ అనే అర్థం వచ్చే హ్యాష్‌ట్యాగ్స్‌ను కూడా ఇచ్చింది. తన పోస్ట్‌కు ‘అధికారిక ప్రకటన’ అనే ఆసక్తికరమైన పేరును పెట్టడం మరో ప్రత్యేకతగా నిలిచింది. సాధారణంగా సెలబ్రిటీలు తమ సినిమాలు, ఫొటోషూట్లు, వ్యక్తిగత విషయాలను సోషల్ మీడియాలో పంచుకుంటుంటారు. కానీ నభా నటేష్ మాత్రం తల్లితో తనకున్న అనుబంధాన్ని సరదాగా, ఎమోషనల్‌గా పంచుకుంది. దీంతో ఆమె పోస్ట్ అభిమానులను ఆకట్టుకుంటోంది. అమ్మ ప్రేమ, అనుభవం ముందు ఎంతటి టెక్నాలజీ ఉన్నా తక్కువేనంటూ నెటిజన్లు స్పందిస్తున్నారు. ప్రస్తుతం నభా నటేష్ షేర్ చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Loading...
Unable to load recommendations.
Follow Us