ఆ స్టార్ హీరో అలా మాట్లాడతారనుకోలేదు.. పొరపాటున చేశా అని చెప్పిన వినలేదు : లయ

ఒకానొక సమయంలో తన అందంతో ప్రేక్షుకులను ఆకట్టుకుంది ముద్దుగుమ్మ లయ. స్వయంవరం సినిమాతో హీరోయిన్ గా పరిచయమైన లయ ఆతర్వాత వరుసగా సినిమాలు చేసి ప్రేక్షకులను అలరించింది. చాలామంది హీరోయిన్లు గ్లామరస్ రోల్స్ తో మెప్పిస్తే ఈ అందాల తార మాత్రం హోమ్లీ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది.

ఆ స్టార్ హీరో అలా మాట్లాడతారనుకోలేదు.. పొరపాటున చేశా అని చెప్పిన వినలేదు : లయ
Laya

Updated on: Oct 12, 2026 | 10:33 AM

ఒకప్పుడు తన అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న కథానాయిక లయ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. గ్లామర్ పాత్రలకు దూరంగా ఉంటూ, హోమ్లీ హీరోయిన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ.. తనదైన నటనతో అభిమానులను సంపాదించుకుంది. ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్‌తో మళ్లీ సినిమాల్లో బిజీ అయ్యేందుకు ప్రయత్నిస్తున్న లయ.. ఇటీవలే లయ బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నారు. నితిన్ తమ్ముడు సినిమాలో నటించారు లయ. అలాగే ఇప్పుడు కొన్ని సినిమాలు, వెబ్ సిరీస్ ల్లోనూ నటిస్తున్నారు. కాగా గతంలో ఓ ఇంటర్వ్యూలో లయ పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ముఖ్యంగా నందమూరి బాలకృష్ణతో కలిసి పనిచేసిన సమయంలో జరిగిన ఓ సరదా సంఘటనను గుర్తుచేసుకున్నారు. లయ స్వయంవరం సినిమాతో కథానాయికగా తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టారు. తొలి సినిమాతోనే తన అందం, అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఆ తర్వాత మా బాలాజీ, మనోహరం, దేవుళ్లు, హనుమాన్ జంక్షన్, ప్రేమించు, శివరామరాజు, మిస్సమ్మ, స్వరాభిషేకం, అదిరిందయ్యా చంద్రం వంటి సినిమాల్లో నటించి మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. కొంతకాలం సినిమాలకు దూరంగా ఉన్న ఆమె.. ఇప్పుడు తిరిగి వెండితెరపై సందడి చేస్తున్నారు.

ఈ ఇంటర్వ్యూలో లయ తన సినీ ప్రయాణానికి సంబంధించిన పలు విషయాలను వెల్లడించారు. రాఘవేంద్రరావు నిర్వహించిన ఓ పోటీ ద్వారా తాను ఇండస్ట్రీలోకి వచ్చానని తెలిపారు. ఆ పోటీలో నటుడు శివాజీ కూడా పాల్గొన్నారని, అప్పటి నుంచే ఆయనతో పరిచయం ఉందని చెప్పారు. శివాజీతో కలిసి ‘మిస్సమ్మ’, ‘అదిరిందయ్యా చంద్రం’, ‘టాటా బిర్లా మధ్యలో లైలా’ వంటి చిత్రాల్లో నటించిన విషయాన్ని గుర్తుచేసుకున్నారు. ఆయనతో కలిసి పనిచేయడం చాలా సులభంగా ఉండేదని, తన నటనకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చేవారని పేర్కొన్నారు.

నందమూరి బాలకృష్ణతో కలిసి విజయేంద్ర వర్మ సినిమాలో పనిచేసిన అనుభవాలను కూడా లయ పంచుకున్నారు. బాలకృష్ణ గురించి బయట వినే మాటలతో ఆయన చాలా కోపంగా ఉంటారని మొదట భావించానని, కానీ దగ్గరగా చూసిన తర్వాత ఆయన ఎంతో ఆప్యాయంగా, సరదాగా ఉండే వ్యక్తి అని అర్థమైందని తెలిపారు. ఈ సినిమా పాట చిత్రీకరణ సమయంలో డాన్స్ స్టెప్స్ ప్రాక్టీస్ చేస్తుండగా, అనుకోకుండా బాలకృష్ణ కాలు తొక్కానని లయ చెప్పారు. అప్పుడు ఆయన సరదాగా ప్యాకప్ చెప్పి, తనను సినిమా నుంచి తీసేయమన్నట్లు మాట్లాడటంతో నిజంగానే భయపడి ఏడుపొచ్చిందని గుర్తుచేసుకున్నారు. తాను ఏడుస్తున్నానని గమనించిన బాలకృష్ణ వెంటనే అది సరదాగా అన్న మాటేనని, నిజమనుకోవద్దని నవ్వుతూ చెప్పారట. డాన్స్ సన్నివేశాల్లో కూడా బాలకృష్ణ తనను ప్రోత్సహించేవారని, అప్పుడప్పుడు తనకంటే బాగా చేస్తున్నావంటూ సరదాగా మెచ్చుకునేవారని లయ తెలిపారు. ఆయనతో దగ్గరగా మాట్లాడితే ఎన్టీఆర్‌ను చూసినట్లుగా అనిపిస్తుందని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం లయ చేసిన ఈ వ్యాఖ్యలు నెట్టింట ఆసక్తికరంగా మారాయి.

 

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us