Lavanya tripati: షాకింగ్ న్యూస్ చెప్పిన హీరోయిన్.. వస్తువులను చూస్తే భయపడతానంటున్న లావణ్య త్రిపాఠి..

అందాల రాక్షసి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు హీరోయిన్‏గా పరిచయమైంది లావణ్య త్రిపాఠి. మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకున్న లావణ్య తన నటనతో

Lavanya tripati: షాకింగ్ న్యూస్ చెప్పిన హీరోయిన్.. వస్తువులను చూస్తే భయపడతానంటున్న లావణ్య త్రిపాఠి..
Lavanya

Updated on: Aug 12, 2021 | 11:44 AM

అందాల రాక్షసి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు హీరోయిన్‏గా పరిచయమైంది లావణ్య త్రిపాఠి. మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకున్న లావణ్య తన నటనతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది. తమిళ్, తెలుగు భాషలలో వరుస ఆఫర్లను అందుకుంటూ టాప్ హీరోయిన్స్‏కు గట్టి పోటీనిచ్చింది. ప్రస్తుతం ఈ అమ్మడు తెలుగులో వరుస సినిమాలలో నటిస్తూ బిజీగా గడిపేస్తుంది. అటు సినిమాలతోపాటు.. సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్‏గా ఉండే లావణ్య ఇప్పుడు ప్రకృతి ఒడిలో సేదతీరుతూ… వృత్తిపరమైన ఒత్తిడి నుంచి విరామం తీసుకుంటానని తెలిపింది. ఎప్పుడూ షూటింగ్స్‏లో బిజీగా ఉండే ఈ హీరోయిన్ ప్రస్తుతం కొత్త కథలను వినేందుకు సమయం కేటాయించింది. తాజాగా ఈ అమ్మడు తన ఇన్‏స్టా ద్వారా అభిమానులతో ముచ్చటించింది.

జీవితంలో సంతోషంగా లేనప్పుడు ఇతరులకు ఆనందాన్ని పంచలేము. ఆ సిద్ధాంతాన్ని నేను బాగా నమ్ముతాను. వ్యక్తిగత జీవితంలో ఏం జరుగుతుందో అప్పుడప్పుడు తరచి చూసుకోవడం ముఖ్యమే. స్వీయ విశ్లేషణ వలన నేను చేసే తప్పొప్పుల్ని సరిదిద్దుకునే అవకాశం దొరుకుతుంది. మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకున్నప్పుడే మన జీవన శైలి సక్రమంగా సాగుతుంది. నాకు ట్రిపోఫోబియా ఉంది.. కొన్ని ఆకారాలను, వస్తువులను చూడగానే తెలియకుండానే నాలో భయం కలుగుతుంది. ఈ సమస్య నుంచి బయటపడటానికి చాలా రోజులుగా ప్రయత్నిస్తున్నాను అంటూ చెప్పుకొచ్చింది. అలాగే తను నటించిన రెండు చిత్రాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయని… అందుకే తన కెరీర్‏కు స్వల్ప విరామం తీసుకోవాలనుకుంటున్నట్లుగా తెలిపారు. త్వరలోనే మళ్లీ కెమెరా ముందుకు రాబోతున్నట్లుగా తెలిపింది.

Also Read: R. Narayanamurthy: సీఎం కేసీఆర్ దేశానికే ఆదర్శం.. రైతుబంధుపై ఆర్. నారాయణ మూర్తి వ్యాఖ్యలు..

Ester Anil: ఈ హీరోయిన్ సాహసానికి నెటిజన్లు ఫిదా.. గౌనులో వయ్యారాల చిన్నది.. లుక్ అదుర్స్..

Balakrishna: బాలయ్యను ఢీకొట్టనున్న మక్కల్ సెల్వన్.. మాస్ కాంబో అదిరిపోవాల్సిందే అంటున్న అభిమానులు..

 

Loading...
Unable to load recommendations.
Follow Us