Kiara Advani: కోలీవుడ్‏లోకి ఎంట్రీ ఇస్తున్న బాలీవుడ్ ముద్దుగుమ్మ.. ఆ స్టార్ హీరో సినిమాలో కియారాకు ఛాన్స్ ?..

|

Jun 06, 2022 | 5:21 PM

అందం, అభినయంతో టాలీవుడ్ ఆడియన్స్‏ను ఆకట్టుకుంది. ఈ మూవీ తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సరసన వినయ విధేయ రామ సినిమాలో ఛాన్స్ పట్టేసింది.

Kiara Advani: కోలీవుడ్‏లోకి ఎంట్రీ ఇస్తున్న బాలీవుడ్ ముద్దుగుమ్మ.. ఆ స్టార్ హీరో సినిమాలో కియారాకు ఛాన్స్ ?..
Kiara Advani
Follow us on

సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన భరత్ అనే నేను సినిమాతో తెలుగు తెరకు హీరోయిన్‏గా పరిచయమైంది బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ (Kiara Advani). ఈ సినిమాలో కియారా తన అందం, అభినయంతో టాలీవుడ్ ఆడియన్స్‏ను ఆకట్టుకుంది. ఈ మూవీ తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సరసన వినయ విధేయ రామ సినిమాలో ఛాన్స్ పట్టేసింది. పక్కా మాస్ యాక్షన్ నేపథ్యంలో వచ్చిన ఈ మూవీ ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయింది. దీంతో ఈ అమ్మడుకు తెలుగులో అవకాశాలు తగ్గిపోయాయి. గత కోద్ది రోజులుగా బాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస ఆఫర్లు అందుకుంటూ బిజీగా ఉన్న కియారా ప్రస్తుతం తెలుగులో రామ్ చరణ్.. డైరెక్టర్ శంకర్ కాంబోలో రాబోతున్న సినిమాలో నటిస్తోంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.

ఇప్పటివరకు టాలీవుడ్, బాలీవుడ్ ఇండస్ట్రీలలోనే అవకాశాలు అందుకున్న ఈ చిన్నది.. ఇప్పుడు కోలీవుడ్ అరంగేట్రం చేయబోతున్నట్లుగా టాక్ వినిపిస్తోంది. టాలెంటెడ్ స్టార్ హీరో శివ కార్తికేయన్ ప్రధాన పాత్రలో డైరెక్టర్ మడోన్ అశ్విన్ దర్శకత్వంలో ఓ సినిమా రాబోుతన్న సంగతి తెలిసిందే. ఈ మూవీలో హీరోయిన్ కోసం కియారా అద్వానీని సంప్రదించారట డైరెక్టర్. స్టోరీ విన్న కియారా కోలీవుడ్ ఎంట్రీ ఇచ్చేందుకు సుముఖత చూపించినట్లుగా తెలుస్తోంది. ఈ విషయంపై త్వరలోనే అధికారక ప్రకటన రానుందని కోలీవుడ్ వర్గాల్లో టాక్ నడుస్తోంది.