Kiara Advani: శంకర్.. చరణ్ ప్రాజెక్ట్ పై కియారా అద్వానీ షాకింగ్ కామెంట్స్.. అసలు విషయం చెప్పేసిన బాలీవుడ్ బ్యూటీ..

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, డైరక్టర్ శంకర్ కాంబోలో వస్తున్న ఈ మూవీ పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. వీరిద్దరి కాంబోలో వర్క్ చేయడం ప్రత్యేక అనుభవమంటూ చెప్పుకొచ్చింది కియారా.

Kiara Advani: శంకర్.. చరణ్ ప్రాజెక్ట్ పై కియారా అద్వానీ షాకింగ్ కామెంట్స్.. అసలు విషయం చెప్పేసిన బాలీవుడ్ బ్యూటీ..
Kiara Advani

Updated on: Jul 04, 2022 | 10:49 AM

సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన భరత్ అనే నేను సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ (Kiara Advani). అ తర్వాత రామ్ చరణ్ జోడీగా వినయ విదేయ రామ చిత్రంలో మెరిసింది. ఈ మూవీ తర్వాత తెలుగులో మరో సినిమా చేయలేదు కియారా. ప్రస్తుతం ఈ అమ్మడు భూల్ భూలయ్యా 2 సినిమా హిట్ ఎంజాయ్ చేస్తుంది. ఈ క్రమంలో ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గోన్న కియారా తాను మొట్ట మొదటి సారి నటిస్తోన్న ఆర్సీ 15 గురించి పలు ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, డైరక్టర్ శంకర్ కాంబోలో వస్తున్న ఈ మూవీ పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. వీరిద్దరి కాంబోలో వర్క్ చేయడం ప్రత్యేక అనుభవమంటూ చెప్పుకొచ్చింది కియారా.

కియారా మాట్లాడుతూ.. కథ..నా పాత్ర గురించి చెప్పడానికి నాకు పర్మిషన్ లేదు. నేను ఏం చెప్పలేను. ఇది పూర్తిగా భిన్నమైన ప్రపంచం. డైరెక్టర్ శంకర్ ఎలాంటి కథైనా.. పాత్రనైనా అద్భుతంగా మార్చగలరు. సినిమాను మ్యాజిక్ చేస్తాడు. ఆయన దర్శకత్వంలో పనిచేయడం గొప్ప అనుభవం. సెట్ లో స్పాంజ్ లాగా ఉన్నాను.. నా చుట్టూ జరిగే ప్రతి దాన్ని నిరంతరం గమనిస్తున్నాను.. గతేడాది నవంబర్ నుంచి షూటింగ్ చేస్తున్నాము.. త్వరలోనే తదుపరి షెడ్యూల్ ప్రారంభిస్తాము.. ఇది నా మొదటి పాన్ ఇండియా సినిమా కావడంతో చాలా ఉత్సాహంగా ఉన్నాను” అంటూ చెప్పుకొచ్చింది.

Follow Us