
బాలీవుడ్ ఇండస్ట్రీలో ఆమె మంచి క్రేజ్ సంపాదించుకున్న హీరోయిన్. ముఖ్యంగా బుల్లితెరపై తనదైన ముద్ర వేసింది. అయితే 41 ఏళ్ల వయసులో మరో పెళ్లి చేసుకోవడానికి రెడీ అయ్యింది. ఆమె మరెవరో కాదు.. జెన్నిఫర్ వింగెట్. పలు సీరియల్స్ ద్వారా హిందీ సినీరంగంలో మంచి గుర్తింపు తెచ్చుకుంది. హిందీ టెలివిజన్ ప్రపంచంలో అత్యంత ప్రజాదరణ పొందిన నటీమణులలో ఒకరు. కానీ గత కొన్ని సంవత్సరాలుగా ఆమె తన వ్యక్తిగత జీవితం కంటే తన కెరీర్‌పైనే ఎక్కువ దృష్టి సారించారు. అయితే ఇప్పుడు, ఆమె రెండవ వివాహం గురించిన వార్త సోషల్ మీడియాలో, వినోద పరిశ్రమలో వైరలవుతుంది. జెన్నిఫర్ వింగెట్‌కు చిన్నప్పటి నుంచే నటనపై అమితమైన ఆసక్తి ఉండేది. బాలనటిగా, ఆమె ‘అకేలే హమ్ అకేలే తుమ్’, ‘రాజా కీ ఆయేగీ బారాత్’, ‘రాజా కో రాణి సే ప్యార్ హో గయా’ వంటి అనేక చిత్రాలలో నటించారు. ఆమె చిన్న వయసులోనే కెమెరా ముందుకు వచ్చి, ఆ తర్వాత టెలివిజన్‌లో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు.
ఎక్కువ మంది చదివినవి : S Janaki: ఆ ఒక్క పాట.. జానకమ్మ స్వరంలో మళ్లీ మళ్లీ వినాలనిపించే మెలోడీ.. అప్పుడు ఇప్పుడు యూత్ ఫేవరేట్ సాంగ్..
బూమ్ బూమ్, కసౌతీ జిందగీ కే, క్యా హోగా నిమ్మో కా, కహీ తో హోగా, సరస్వతీ చంద్ర , బేహద్ వంటి సీరియల్స్‌లో జెన్నిఫర్ నటన ఆమెకు అపారమైన ప్రజాదరణను తెచ్చిపెట్టింది. ముఖ్యంగా బేహద్‌లో ఆమె నటన అభిమానులు , విమర్శకుల నుండి మంచి ఆదరణ పొందింది. అయితే కెరీర్ మంచి ఫాంలో ఉండగానే.. ‘దిల్ మిల్ గయే’ చిత్రంలో తన సహనటుడైన కరణ్ సింగ్ గ్రోవర్‌తో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. కొన్నాళ్లు ప్రేమలో ఉన్న వీరిద్దరు 2012లో వివాహం చేసుకున్నారు. కానీ పెళ్లైన రెండేళ్లకే మనస్పర్థలతో ఇద్దరూ 2014లో విడాకులు తీసుకున్నారు. డివోర్స్ తర్వాత కరణ్ సింగ్ నటి బిపాషా బసును వివాహం చేసుకున్నారు.
ఎక్కువ మంది చదివినవి : Singer S Janaki : పుట్టింది రేపల్లే పల్లపట్లలో.. పెరిగింది కరీంనగర్ జిల్లా సిరిసిల్లలో.. జానకమ్మ ప్రస్థానం ఇదే..
కానీ జెన్నిఫర్ మాత్రం పూర్తిగా తన కెరీర్ పై దృష్టి పెట్టారు. దాదాపు 12 సంవత్సరాలుగా ఒంటరిగానే ఉంటూ వరుస సినిమాలు, సీరియల్స్ ద్వారా అలరిస్తుంది. తాజాగా ఆమె రెండో పెళ్లి చేసుకోబోతుందనే టాక్ నడుస్తుంది. చాలా ఏళ్లుగా ఒంటరిగా ఉన్న ఈ నటి ఇప్పుడు కొత్త జీవితాన్ని ప్రారంభించాలని నిర్ణయించుకుందని టాక్ నడుస్తుంది. నివేదికల ప్రకారం జెన్నిఫర్ సింగపూర్ వ్యాపారవేత్త విలియం ఇష్మాయెల్‌ను వివాహం చేసుకోబోతుందని ప్రచారం నడుస్తుంది. వీరిద్దరి వివాహం జూలై 16న జరగనున్నట్లు టాక్. యునైటెడ్ కింగ్‌డమ్‌లో ఈ వివాహం చాలా ప్రైవేట్‌గా జరుగుతుందని, ఈ వేడుకకు కేవలం కుటుంబ సభ్యులు, సన్నిహితులు మాత్రమే హాజరవుతారని సమాచారం.
ఎక్కువ మంది చదివినవి : Vikram Chiyaan : ఆ హీరోయిన్ దేవత.. చాలా మిస్ అవుతున్నాను.. హీరో విక్రమ్ కామెంట్స్..
ఎక్కువ మంది చదివినవి : OTT Cinema : అడవిలో అమ్మాయి మరణం.. ఓటీటీని అల్లాడిస్తున్న థ్రిల్లర్ సినిమా.. తెలుగులోనూ చూడొచ్చు..