
మాస్ మహారాజ రవితేజ హిట్ కోసం గట్టిగానే ప్రయత్నిస్తున్నాడు. ఇటీవల రవితేజ నటించిన సినిమాలన్నీ నిరాశపరుస్తున్నాయి. ఇక ఇప్పుడు ఇరుముడి అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. రవితేజ బ్లాక్ బస్టర్ మూవీస్ లో విక్రమార్కుడు సినిమా ఒకటి. రవితేజ హీరోగా నటించిన విక్రమార్కుడు సంచలన విజయం సాధించింది. మాస్ రాజా ఈ సినిమాలో డ్యూయల్ రోల్ లో కనిపించి ఆకట్టుకున్నాడు. అత్తిలి సత్తిబాబుగా ఓ పాత్రలో తన కామెడీతో అదరగొట్టాడు.. అదేవిధంగా విక్రమ్ రాథోడ్ పాత్రలో పవర్ ఫుల్ గా కనిపించి మెప్పించాడు రవితేజ. ఈ సినిమాలో కథ, రవితేజ యాక్టింగ్, రాజమౌళి మేకింగ్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి.
ఇక ఈ సినిమా భారీ హిట్‌గా నిలిచింది. ఈ సినిమాఆ మధ్య రీరిలీజ్ కూడా అయ్యింది. రీ రిలీజ్‌లో కూడా ఈ సినిమాను విపరీతంగా ఎంజాయ్ చేశారు ఆడియన్స్. విక్రమార్కుడు సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో పాటు సినిమాలో నటించిన అందరికి మంచి గుర్తింపు వచ్చింది. పై ఫోటో చూశారా.? విక్రమార్కుడు సినిమాలో నటించిన ఈ నటి గుర్తుందా.? ఆమె పేరు జయవాణి. విక్రమార్కుడు సినిమాలో ఆమె ఓ సన్నివేశంలో తన నటనతో ఆకట్టుకుంది.
క్రికెట్ బాల్ తో కొట్టాడని పిల్లని బట్టలూడదీస్తాడు అత్తిలి సత్తిబాబు.. దాంతో ఆ పిల్లల తల్లిదండ్రులు వచ్చి రవితేజతో గొడవ పెట్టుకొని రచ్చ రచ్చ చేస్తారు. ఆ పిల్లల తల్లులతో రవితేజకు గొడవపడి.. జుట్టు జుట్టు పట్టుకొని కొట్టుకుంటారు. ఆ సీన్ లో జయవాణి ఆకట్టుకున్నారు. కాగా గతంలో ఆమె ఓ ఇంటర్వ్యూలో ఈ సన్నివేషం గురించి షూటింగ్ లో జరిగిన విషయాలను పంచుకున్నారు. ఆమె మాట్లాడుతూ.. సినిమా షూటింగ్ జరిగేటప్పుడు రవితేజ మా దగ్గరకు వచ్చారు.. మీలో జయవాణి ఎవరు..? అని అడిగారు. నేనే సార్ అని చెప్పా.. అమ్మ ఇది చాలా మంచి సీన్.. నాకు పిచ్చిపిచ్చిగా నచ్చింది. యాక్షన్ చెప్పగానే మీరు కొట్టండి.. నేను కొడతా.. మీరు జుట్టుపట్టుకోండి.. నేను కూడా జుట్టు పట్టుకొని లాగుతా.. మీరు ఏం ఫీల్ అవ్వొద్దు అని అన్నారు. ఆయన అలా చెప్పిన తర్వాత అమ్మయ్య అనుకున్నా.. హీరో ఇలా నన్ను కొట్టండి అని చెప్పడం మాములు విషయం కాదు. ఇక సీన్ లోకి వెళ్లిన తర్వాత నిజంగానే కొట్టుకున్నాం.. ఆయన జుట్టు పట్టుకొని కొడుతుంటే కొంచం ఊడి నా చేతికి కూడా వచ్చింది అని అప్పటి విషయాలను పంచుకున్నారు జయవాణి. ఈ కామెంట్స్ ఇప్పుడు మరోసారి వైరల్ అవుతున్నాయి.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.