12 రోజులు వాళ్ళతో గడిపితే కారు, ఫ్లాట్‌ గిఫ్ట్‌గా ఇస్తామన్నారు.. టాలీవుడ్ నటి కామెంట్స్

|

Sep 18, 2024 | 4:53 PM

జానీ మాస్టర్ పై ఓ యువతీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనను జానీ లైంగికంగా వేధించాడని, మతం మార్చుకుంటే పెళ్లి చేసుకుంటాను టార్చర్ చేశాడని, అలాగే ఎవరికైనా చెప్తే అవకాశాలు రాకుండా చేస్తాను అని బెదిరించాడని ఆమె ఆరోపించింది. ఇక ఇప్పుడు జానీ కోసం పోలీసులు గాలిస్తున్నారు.

12 రోజులు వాళ్ళతో గడిపితే కారు, ఫ్లాట్‌ గిఫ్ట్‌గా ఇస్తామన్నారు.. టాలీవుడ్ నటి కామెంట్స్
Actress
Follow us on

టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం జానీ మాస్టర్ కేసు సంచలనం సృష్టిస్తుంది. తన అసిస్టెంట్ తో అసభ్యకరంగా ప్రవర్తించాడని ఆరోపణలు వచ్చాయి. జానీ మాస్టర్ పై ఓ యువతీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనను జానీ లైంగికంగా వేధించాడని, మతం మార్చుకుంటే పెళ్లి చేసుకుంటాను టార్చర్ చేశాడని, అలాగే ఎవరికైనా చెప్తే అవకాశాలు రాకుండా చేస్తాను అని బెదిరించాడని ఆమె ఆరోపించింది. ఇక ఇప్పుడు జానీ కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఇదిలా ఉంటే 24 క్రాఫ్ట్స్‌లో లైంగిక వేధింపులపై జస్టిస్‌ హేమ కమిటీ నివేదిక మాలీవుడ్‌ను కుదిపేసింది. కమిటీ ఏర్పాటుకు కోలీవుడ్, శాండిల్‌వుడ్‌లో డిమాండ్లు తెరపైకి వచ్చాయి. అలాగే చాలా మంది నటీమణులు బయటకు వచ్చి తమకు ఎదురైన లైంగిక వేధింపుల గురించి బయట పెడుతున్నారు.

ఇది కూడా చదవండి : పట్టుకుంటే కందిపోతుందేమో ఈ చిన్నది.. జయం సినిమా చిన్నది ఎంత అందంగా ఉందో..!

ఇప్పటికే చాలా మంది బయటకు వచ్చు దైర్యంగా మాట్లాడారు. కాగా ఇప్పుడు మరో నటి కాస్టింగ్ కౌచ్ గురించి షాకింగ్ విషయాలు బయట పెట్టింది. ఆమె నటి గాయత్రి గుప్తా ఈమె గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది. గాయత్రి గుప్తా చిన్న చిన్న సినిమాల్లో నటించింది. హీరోయిన్ ఫ్రెండ్ గా కొన్ని సినిమాల్లో చేసింది. ఫిదా సినిమాలో సాయి పల్లవి ఫ్రెండ్ గా చేసింది. అలాగే పలు వివాదాలతోనూ గాయత్రి గుప్తా పాపులర్ అయ్యింది. గతంలో బిగ్ బాస్ షో పై షాకింగ్ కామెంట్స్ చేసింది.

ఇది కూడా చదవండి :Samantha : ఇండస్ట్రీలో ఆయనే నాకు గురువు.. స్టార్ హీరో పై ప్రేమ కురిపించిన సామ్

గాయత్రి గుప్తా గతంలో మాట్లాడుతూ.. బిగ్ బాస్ షోను బ్యాన్ చేయాలని కూడా ఆమె డిమాండ్ చేసింది. తనకు బిగ్ బాస్ ఆఫర్స్ వచ్చిందని.. కానీ దాన్ని ఆమె తిరస్కరించాను అని చెప్పుకొచ్చింది. ఇదిలా ఉంటే తాజాగా గాయత్రి గుప్తా ఓ యూట్యూబ్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. లైంగిక వేధింపుల గురించి కామెంట్స్ చేసింది. తెలుగులో పలు సినిమాలు చేసిన ఆమెకు బాలీవుడ్ నుంచి కూడా ఆఫర్స్ వచ్చాయి అని చెప్పింది. బాలీవుడ్ లో కొందరు తనతో అసభ్యకరంగా ప్రవర్తించాడు అని చెప్పుకొచ్చింది. అప్పుడు నన్ను 12 రోజులు వాళ్లతో గడపాలని అడిగారు. అలా చేస్తే ఓ ఫ్లాట్, కారుతో పాటు పది లక్షల రూపాయలు ఇస్తానని చెప్పారు. దాంతో నేను ఎవరికీ చెప్పుకోవాలో తెలియక అక్కడి నుంచి వచ్చేశాను అని తెలిపింది. ఇలా కాస్టింగ్ కౌచ్ అనేది అన్ని చోట్ల ఉంది అని చెప్పుకొచ్చింది గాయత్రి గుప్తా.

ఇది కూడా చదవండి : ఈ అందాల నటి గుర్తుందా.? ఒకప్పుడు కుర్రాళ్ళ ఫెవరెట్ ఆమె.. ఇప్పుడు ఎలా ఉందంటే

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.