
చిత్రపరిశ్రమలో బిజీగా ఉన్న హీరోలలో యంగ్ హీరో నిఖిల్ ఒకరు. ప్రస్తుతం ఈ యంగ్ హీరో 18 పేజెస్ సినిమా చేస్తున్నాడు. ఇందులో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్గా నటిస్తోంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. రొమాంటిక్ ఎంటర్టైనర్గా రూపొందుతున్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా తర్వాత నిఖిల్ కార్తికేయ 2 మూవీ చేయనున్నాడు. నిఖిల్ ప్రధాన్ పాత్రలో చందూ మొండేటి దర్శకత్వం వహించిన బ్లాక్ బస్టర్ హిట్ కార్తికేయ సినిమాకు ఇది సీక్వెల్‌గా తెరకెక్కుతుంది. ఇటీవలే ఈ మూవీ షూటింగ్ పూజా కార్యక్రమాలను నిర్వహించారు చిత్రయూనిట్. కార్తికేయ 2 అనే వర్కింగ్ టైటిల్‌తో ఈ మూవీ తెరకెక్కుతుంది.
ఇదిలా ఉంటే.. తాజాగా కార్తికేయ 2 సినిమా హీరోయిన్ను కాస్త డిఫరెంట్‌గా పరిచయం చేశాడు నిఖిల్.. నిన్న కృష్ణాష్టమి సందర్భంగా.. కార్తికేయ 2 సినిమాలో నటిస్తున్న హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ అంటూ రివీల్ చేసేశాడు నిఖిల్. ఈ చిత్రానికి మరోసారి చందూ మొండేటి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీలో హీరోయిన్ ఎవరు అనే విషయాన్ని చాలా రోజులు రహస్యంగా ఉంచాం. కానీ ఇప్పుడు బయటపెడుతున్నాం.. అనుపమతో మరోసారి నటించడం ఆనందంగా ఉంది అంటూ చెప్పుకొచ్చాడు నిఖిల్.
ట్వీట్..
ఇక ఒకవైపు సినిమాలు చేస్తూనే.. మరోవైపు సోషల్ మీడియాలోనూ నిత్యం యాక్టివ్‌గా ఉంటారు నిఖిల్. సామాజిక, రాజకీయ అంశాలపై తన స్టైల్లో స్పందిస్తుంటారు. ఇటీవల లాక్డౌన్ సమయంలో నిఖిల్ ఎందరికో సాయం చేసి రియల్ హీరో అనిపించుకున్నారు. అంతేకాదు.. ఇందుకోసం ప్రత్యేకంగా ఓ టీమ్‌ను ఏర్పాటు చేసి సోషల్ మీడియా ద్వారా సమాచారం తెలుసుకుని వారికి సాయం చేశారు.
Also Read: Nani: అభిమానులకు సర్ప్రైజ్ ప్లాన్ చేసిన నాని.. మీకు ఏం కావాలో చెప్పండంటున్న టక్ జగదీష్..
Allu Arjun: అల్లు అర్జున్ ఖాతాలో మరో రికార్డ్… అభిమానులకు థ్యాంక్స్ అంటూ బన్నీ స్పెషల్ ట్వీట్..
Chiranjeevi: మరో తమిళ రీమేక్‌పై కన్నేసిన మెగాస్టార్… సరైన దర్శకుడి కోసం వేట మొదలు పెట్టిన చిరు?