VK Naresh: సీఎం జగన్‏తో సినీ ప్రముఖుల భేటీపై స్పందించిన నటుడు నరేష్.. అభినందనీయం అంటూనే..

|

Feb 12, 2022 | 4:12 PM

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి.. సినీ పరిశ్రమకు మధ్య గత కొద్ది రోజులుగా అనిశ్చితి వాతావరణం కొనసాగుతున్న సంగతి తెలిసిందే.

VK Naresh: సీఎం జగన్‏తో సినీ ప్రముఖుల భేటీపై స్పందించిన నటుడు నరేష్.. అభినందనీయం అంటూనే..
Naresh
Follow us on

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి.. సినీ పరిశ్రమకు మధ్య గత కొద్ది రోజులుగా అనిశ్చితి వాతావరణం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. థియేటర్లు మూతపడడం.. సినిమా టికేట్స్ రేట్స్ తగ్గిస్తూ ప్రభుత్వం జీవో తీసుకురావడం పై సినీ ప్రముఖులు అసహనం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే పలువురు సినీ ప్రముఖులకు.. సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నానికి మధ్య మాటల యుద్ధం నడించింది. అయితే సినీ పరిశ్రమలోని సమస్యలను తగ్గించేందుకు మెగాస్టార్ చిరంజీవి రంగంలోకి దిగిన సంగతి తెలిసిందే. ఇటీవల సూపర్ స్టార్ మహేష్ బాబు, ప్రభాస్, రాజమౌళి, కొరటాల శివ, పోసాని తదితరులతో కలిసి మెగాస్టార్ చిరంజీవి.. ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్‏తో సమావేశమయ్యారు.

ఈ సమావేశంలో ఫిల్మ్ ఇండస్ట్రీ ఎదుర్కోంటున్న సమస్యలపై సీఎంతో కలిసి చర్చించారు. భేటీ అనంతరం సీఎం నుంచి సానుకూల స్పందన వచ్చిందని.. త్వరలోని చిత్ర పరిశ్రమ ఎదుర్కోంటున్న సమస్యలను తగ్గిపోతాయని సినీ ప్రముఖుల బృందం వెల్లడించిన సంగతి తెలిసిందే. అయితే ఈ సమావేశంపై పలువురు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. తాజాగా సీనియర్ నటుడు నరేష్ తన ట్విట్టర్ వేదికగా స్పందించారు. సీఎంతో సమావేశం కావడం అభినందనీయం అంటూనే.. ఫిల్మ్ ఛాంబర్ నేతృత్వంలో వర్క్ షాప్ అవసరమని చెప్పుకొచ్చారు.

“సీఎంతో భేటీ అభినందనీయం. అయితే తెలుగు సినీ పరిశ్రమ ఆసక్తులు, సుహృద్భావ పరిష్కారాలు, తీర్మానాలు అధికారికంగా.. ప్రజాస్వామ్యబద్ధంగా ఆమోదించబడిన తెలుగు చిత్ర పరిశ్రమ ఐక్యతను ప్రతిబింబిస్తూ ప్రభుత్వం అలాగే ప్రజల గౌరవాన్ని పొందడం గురించి ఫిల్మ్ ఛాంబర్ నేతృత్వంలో ఓ వర్క్ షాప్ అవసరం. దీనిని త్వరలో ఆశిస్తున్నాముఅంటూ నరేష్ ట్వీట్ చేశారు.

Also Read: Sudheer Babu: కొత్త ప్రాజెక్టును పట్టాలెక్కించిన సుధీర్‌ బాబు.. ఆసక్తికరంగా ఫస్ట్‌ లుక్‌..

Meenakshi Chaudhary: వరుస అవకాశాలు అందుకుంటున్న హర్యానా బ్యూటీ “మీనాక్షి చౌదరి”..(ఫొటోస్)

Geetha Madhuri: సెంటర్ అఫ్ ఎట్రాక్షన్ ‘గీత మాధురి’ ఫ్రెండ్ బర్త్ డే పార్టీలో సింగర్ లేటెస్ట్ ఫొటోస్..

Keerthy Suresh : మహేష్ సినిమాకోసం ఈ ముద్దుగుమ్మ మొదటిసారి అలా కనిపించనుందట..