Vijay Deverakonda: ఒక్క ట్వీట్‏తో రూమర్స్‏కు చెక్ పెట్టిన రౌడీ హీరో.. స్టైలీష్ లుక్‏లో విజయ్.. ..

ఇటీవల సైమా అవార్డ్స్ 2022 వేడుకలలో సందడి చేసిన విజయ్.. తాజాగా సింగిల్ ప్లేయర్ అంటూ తన ఫోటోను చేశారు. అందులో విజయ్ లుక్ స్టైలిష్‏గా ఉంది.

Vijay Deverakonda: ఒక్క ట్వీట్‏తో రూమర్స్‏కు చెక్ పెట్టిన రౌడీ హీరో.. స్టైలీష్ లుక్‏లో విజయ్.. ..
Vijay

Updated on: Sep 13, 2022 | 9:06 AM

రౌడీ హీరో విజయ్ దేవరకొండ‏కు (Vijay Deverakonda) ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అర్జున్ రెడ్డి సినిమాతో ఒక్కసారిగా ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు ఈ హీరో. ఇక ఇటీవల లైగర్ సినిమాతో పాన్ ఇండియా లెవల్లో అభిమానులను సంపాదించుకున్నాడు. ప్రస్తుతం ఖుషి సినిమా చిత్రీకరణతో బిజీగా ఉన్న విజయ్.. చాలా కాలం తర్వాత సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యారు. ఇటీవల సైమా అవార్డ్స్ 2022 వేడుకలలో సందడి చేసిన విజయ్.. తాజాగా సింగిల్ ప్లేయర్ అంటూ తన ఫోటోను చేశారు. అందులో విజయ్ లుక్ స్టైలిష్‏గా ఉంది.

సైమా వేడుకలలో బాలీవుడ్ హీరో రణ్వీర్ సింగ్‎తో స్టేజ్ పై స్టెప్పులేశారు విజయ్. ఇక ఆ సెలబ్రెషన్స్‏కు సంబంధించిన ఫోటోను షేర్ చేస్తూ సింగిల్ ప్లేయర్ అంటూ క్యాప్షన్ ఇచ్చాడు. అయితే విజయ్ రిలేషన్‏షిప్ స్టేటస్ గురించి ఎప్పటికప్పుడు నెట్టింట రూమర్స్ వస్తుంటాయన్న సంగతి తెలిసిందే. అయితే రౌడీ పెట్టిన క్యాప్షన్ పై ఎక్కువగా నెట్టింట చర్చ జరుగుతుంది. ప్రస్తుతం విజయ్ డైరెక్టర్ శివ నిర్వాణ దర్శకత్వంలో ఖుషి సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో విజయ్ సరసన సమంత కథానాయికగా నటిస్తోంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అలాగే మాస్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో జనగణమన సినిమా చేస్తున్నారు.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us